S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/09/2016 - 06:28

గయ, మే 8: తన కారును ఓవర్‌టేక్ చేశాడన్న ఆగ్రహంతో బిహార్‌లో జెడి (యు) ఎమ్మెల్సీ మనోరమా దేవి కుమారుడు ఓ 29 ఏళ్ల యువకుడిని కాల్చి చంపేసిన సంఘటన ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సంఘటనకు సంబంధించి ఎమ్మెల్సీ భర్త బిందేశ్వరి ప్రసాద్ యాదవ్ అలియాస్ బిండియాదవ్‌ను, ఆమె సెక్యూరిటీ గార్డు రాజేశ్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు మగధ్ రేంజి డిఐజి సౌరభ్ కుమార్ చెప్పారు.

05/09/2016 - 00:35

నాగ్‌పూర్, మే 8: మహారాష్టల్రో అగ్రవర్ణాల వారు తమకు నీరు అందకుండా చేయడంతో ఆగ్రహం చెందిన ఒక దళిత శ్రామికుడు పట్టుదలతో గంటల కొద్దీ శ్రమించి సొంతగా బావిని తవ్వుకోవడం ద్వారా వారిపై ప్రతీకారం తీర్చుకున్నాడు. కరవు పీడిత విదర్భ ప్రాంతంలోని వాషిమ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే..

05/09/2016 - 00:32

న్యూఢిల్లీ, మే 8: ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాలు, పదోన్నతులకు సంబంధించి సవరించిన విధాన పత్రం (మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్)లోని రెండు నిబంధనల పట్ల సుప్రీంకోర్టు కొలీజియం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇందులోని ఒక నిబంధన ప్రకారం జాతీయ ప్రయోజనాల రీత్యా సుప్రీంకోర్టు కొలీజియం చేసిన ఏ సిఫార్సునయినా తిరస్కరించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.

05/09/2016 - 00:29

న్యూఢిల్లీ, మే 8: పార్లమెంటు ఉభయ సభలు ముఖ్యంగా రాజ్యసభను కొనసాగనివ్వకూడదని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా బేసిన్‌లో చమురు నిక్షేమాలు వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక సంస్థను ఏర్పాటు చేసి ప్రజా సొమ్మును దుర్వినియోగం చేశారన్నది కాంగ్రెస్ ఆరోపణ. గుజరాత్ కాగ్ ఇలాంటి అభిప్రాయానే్న వ్యక్తం చేసింది.

05/09/2016 - 00:28

న్యూఢిల్లీ, మే 8: దేశ రాజధాని ఢిల్లీలోని సిఆర్ పార్కు ప్రాంతంలో శనివారం రాత్రి ఓలా క్యాబ్ డ్రైవర్ ఒకరు కారులోనే 23 ఏళ్ల బెల్జియం యువతిపై అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన వెలుగు చూసింది. ఈ సంఘటన జరిగిన కొద్ది గంటలకే ఆదివారం తెల్లవారుజామున రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాకు చెందిన ఆ క్యాబ్ డ్రైవర్ బలరాజ్ సింగ్ అలియాస్ రాజ్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.

05/09/2016 - 07:08

ఉజ్జయిని, మే 8: అయోధ్యలోని రామజన్మభూమిలో ఈ సంవత్సరం నవంబర్ 9నుంచి మందిర నిర్మాణం ప్రారంభమవుతుందని కొందరు సాధువులు తాజాగా ఉజ్జయినిలో తీర్మానించారు. అయితే తేదీ ప్రకటించినట్లయితే అనవసర వివాదానికి తెరలేపినట్లవుతుందని అధికారికంగా ప్రకటించవద్దని నిర్ణయించినట్లు సమాచారం.

05/09/2016 - 00:23

న్యూఢిల్లీ, మే 8: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంతో సంబంధాలు ఉన్నవారికి రిటైర్మెంట్ తర్వాత ‘మంచి పదవులు’ కట్టబెట్టారని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. వివాదాస్పద వివిఐపి హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో కాంగ్రెస్ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని వస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఆదివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

05/09/2016 - 00:22

కటక్, మే 8: దేశంలో జడ్జీల కొరతపై తరచూ ఆందోళనను వ్యక్తం చేస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ ఆదివారం మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించారు. న్యాయం పొందడం అనేది పౌరుల ప్రాథమిక హక్కని, ప్రభుత్వాలు ప్రజలకు ఆ హక్కును లేకుండా చేయరాదని అన్నారు.

05/09/2016 - 00:19

కుట్టనాడ్ (కేరళ), మే 8: కేవలం ప్రభుత్వాలను మార్చడం గురించి కాక తమ భవిష్యత్తుల గురించి కూడా ఆలోచించాలని ప్రధాని నరేంద్ర మోదీ కేరళ ప్రజలకు ఆదివారం విజ్ఞప్తి చేశారు. ఇనే్నళ్లు అధికారంలో ఉండి కూడా ప్రజలకు కనీసం తాగు నీరు కూడా అందించలేకపోయాయంటూ యుడిఎఫ్, ఎల్‌డిఎఫ్ ప్రభుత్వాలను ఆయన దుయ్యబట్టారు. ‘కేరళ చుట్టూ నీళ్లున్నాయి. అయినా ఇప్పటికీ ఇక్కడ మంచినీళ్లు లేవు.

05/08/2016 - 16:26

గయ:అధికార జెడియు ఎమ్మెల్యే మనరోమాదేవి తనయుడు ఓ యువకుడిని కాల్చి చంపిన సంఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. ఆదిత్య సచ్‌దేవ్ అనే యువకుడు తన స్నేహితులతో కలసి వాహనాల్లో వెళుతూ ఎమ్మెల్యే తనయుడు రాకీయాదవ్ వెళుతున్న వాహనాలను ఓవర్ టేక్ చేశారు. దీంతో ఆగ్రహం కట్టలుతెంచుకున్న రాకీ తన అనుచరులతో సచ్‌దేవ్ బృందంపై దాడి చేయించాడు.

Pages