S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/08/2016 - 02:46

హైదరాబాద్, మే 7: కర్ణాటకలోని ప్రైవేటు వైద్య కళాశాలలు ఆదివారం నిర్వహించబోతున్న ‘కామెడ్’ ప్రవేశ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరీక్ష రాసే విద్యార్థుల కోసం ఇప్పటికే తెలంగాణలో 3, ఎపిలో 5 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నీట్‌పై సుప్రీంకోర్టు తీర్పు నేపధ్యంలో ఈ పరీక్షను రద్దు చేశారు.

05/08/2016 - 02:34

విజయవాడ, మే 7: దేశ చరిత్రలోనే తొలిసారిగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ వీరపాండియన్ ఆప్తిపన్ను బటకాయి పడ్డ రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ స్టేషన్‌కు శనివారం తాళాలు వేశారు. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన విజ్ఞప్తులు సూచనలను పురష్కరించుకుని తిరిగి ఆ తాళాలను తొలగించారు.

05/08/2016 - 07:17

న్యూఢిల్లీ, మే 7: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం తాము చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలంటూ ఏపి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్‌రావుకేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడుకు శనివారం నాడొక లేఖ రాశారు. ‘దయచేసి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో మీకున్న అనుబంధం, బిజెపి పూర్వాధ్యక్షుడుగా మీకున్న అనుభవం రంగరించి హోదాపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి.

05/07/2016 - 18:01

నైనిటాల్: అనర్హత వేటు పడిన 9 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సంబంధించి ఈనెల 9న తీర్పు ఇవ్వనున్నట్లు ఉత్తరాఖండ్ హైకోర్టు శనివారం స్పష్టం చేసింది. ఇటీవల 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజెపికి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిని అనర్హులుగా ప్రకటిస్తూ అసెంబ్లీ స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. స్పీకర్ ఆదేశాలు చెల్లవంటూ ఈ 9 మంది రెబల్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు.

05/07/2016 - 18:00

దిల్లీ: పోలీసులపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై దిల్లీ సిఎం కేజ్రీవాల్‌కు ఇక్కడి సాకేత్ కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది. పోలీసు వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

05/07/2016 - 17:59

రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లోని కాఠికల్యాణ్ పోలీసు స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో శనివారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోలు హతమయ్యారు. మావోలు సమావేశం జరుపుతున్నారన్న సమాచారంతో ఆ ప్రాంతంలో కూంబింగ్‌కు పోలీసులు వెళ్లారు. తొలుత మావోలు కాల్పులు జరపగా ఆత్మరక్షణార్థం తాము కూడా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.

05/07/2016 - 17:58

వారణాసి: ఇక్కడి బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో శనివారం ఆక్సిజన్ సిలిండర్ పేలి 16 మంది రోగులు గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

05/07/2016 - 17:58

కోల్‌కత: బ్యాంకాక్ నుంచి శనివారం ఉదయం కోల్‌కత విమానాశ్రయంలో దిగిన ఓ మహిళా ప్రయాణీకురాలిని సోదా చేసి 2.1 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

05/07/2016 - 17:57

దిల్లీ: ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాలని రాజ్యసభలో తాను ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి లేఖ రాశారు. ఈ బిల్లుకు ఎన్‌డిఎలోని భాగస్వామ్య పార్టీలన్నీ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంతో పాటు ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనన్నారు.

05/07/2016 - 15:53

దిల్లీ: అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం జరగకుండా 2012లోనే ఆపి ఉండాల్సిందని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ పార్లమెంటులో వెల్లడించారు. 2013 మార్చిలో సీబీఐ అగస్టా అంశంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిందని, కానీ డిసెంబరు వరకు ఎఫ్‌ఐఆర్‌ కాపీని ఈడీకి పంపించలేదని పారికర్‌ తెలిపారు. వెయ్యి పేజీల పత్రాలను ఇటాలియన్‌ భాష నుంచి అనువదించారని..

Pages