S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/08/2016 - 04:47

విశాఖపట్నం, మే 7: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ 7,500 దరఖాస్తులు పరిష్కరించామని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీ్ధర్ తెలిపారు. విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం రెండు రాష్ట్రాల సమాచార హక్కు ఉద్యమకార్యకర్తల సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో 750 కేసుల్లో జరిమానా విధించామని, 1000 కేసుల్లో నష్టపరిహారం ఇప్పించామన్నారు.

05/08/2016 - 03:49

న్యూఢిల్లీ, మే 7: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం కరువు నెలకొన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరిపారు.

05/08/2016 - 03:47

ముంబయి, మే 7: భారతదేశంలో ఇప్పటికీ అత్యధికంగా బాల వివాహితలున్నారని, గత 15ఏళ్లలో బాల్య వివాహాల సంఖ్య కేవలం 11 శాతమే తగ్గాయని ‘చైల్డ్ రైట్స్ అండ్ యు’ (సిఆర్‌వై) అనే ఓ స్వచ్ఛంద సంస్థ తెలియజేసింది. ఆదివారం అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని జరుపుకోనున్న నేపథ్యంలో ఆ సంస్థ ఈ కఠోర వాస్తవాలను వెల్లడించడం గమనార్హం.

05/08/2016 - 03:39

నైనిటాల్, మే 7: ఉత్తరాఖండ్‌లో సస్పెండ్ అయిన 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల భవితవ్యంపై ఉత్కంఠత పెరుగుతోంది. తొమ్మిది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించిన తీర్పు బలపరీక్షకు ముందు రోజు వెలువడనుంది. ముఖ్యమంత్రి హరీశ్ రావత్ బలపరీక్ష ఈ నెల 10 ఉన్నందున దానికి ముందురోజే అంటే 9న తొమ్మిది మంది ఎమ్మెల్యేల భవిష్యత్ తేలిపోనుంది.

05/08/2016 - 07:08

మదురై, మే 7: గత ఏడాది కనీవినీ ఎరుగని రీతిలో సంభవించిన వరదల సమయంలో ప్రజల కష్టాలు విని వారిని ఓదార్చడానికి బదులు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నాలుగు గోడల మధ్యే ఉండిపోయారంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.

05/08/2016 - 03:33

న్యూఢిల్లీ, మే 7: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి వ్యతిరేకంగా తమకు అందిన ఫిర్యాదుపై తీసుకున్న చర్యల నివేదికను ఢిల్లీ పోలీసులు శనివారం కోర్టుకు సమర్పించారు.

05/08/2016 - 03:32

న్యూఢిల్లీ, మే 7: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ తొమ్మిది రోజులుగా సాగిస్తున్న తన నిరాహార దీక్షను శనివారం విరమించుకున్నారు. కొద్ది రోజుల క్రితం యూనివర్సిటీ క్యాంపస్‌లో దేశ వ్యతిరేక నినాదాలు చేయడానికి సంబంధించి యూనివర్సిటీ తమకు విధించిన శిక్షలకు నిరసనగా కన్హయ్యతోపాటుగా 20 మంది విద్యార్థులు గత వారం రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.

05/08/2016 - 03:31

శ్రీనగర్, మే 7: జమ్మూకాశ్మీర్‌లో శనివారం తెల్లవారు జామున భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు మృతి చెందారు. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.

05/08/2016 - 03:27

న్యూఢిల్లీ, మే 7: ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ వ్యవహారం, అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో సోనియాగాంధీ పాత్రపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. ‘మోదీ నకిలీ డిగ్రీపై కాంగ్రెస్ నోరువిప్పదు. హెలికాప్టర్ల కుంభకోణంలో సోనియా పాత్ర ఉందని తెలిసినా బిజెపి అరెస్టు చేయనీయదు’ అని ధ్వజమెత్తారు.

05/08/2016 - 03:24

కొచ్చి, మే 7: అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఒప్పంద వ్యవహారంలో కేంద్ర మాజీ మంత్రి ఎకె.ఆంటోనీపై బిజెపి శనివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. భారత వైమానిక దళానికి వివిఐపి హెలికాప్టర్ల సరఫరా నిమిత్తం అగస్టా వెస్ట్‌ల్యాండ్ సంస్థతో 2010లో ఈ వివాదాస్పద ఒప్పందాన్ని కుదుర్చుకున్నప్పుడు ఆంటోనీ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నందున ఈ వ్యవహారంపై ఆయన వివరణ ఇవ్వాలని బిజెపి డిమాండ్ చేసింది.

Pages