S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/07/2016 - 07:12

న్యూఢిల్లీ, మే 6: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం భారత్‌లో సామాజిక అశాంతిని సృష్టించడం ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి పెద్ద కుట్ర పన్నాడని నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) పేర్కొంది.

05/07/2016 - 07:12

న్యూఢిల్లీ, మే 6: ప్రధాని నరేంద్ర మోదీ నిలువెల్లా స్వార్థం నిండిన వ్యక్తి అని, ఏకవ్యక్తి అధ్యక్ష పాలన సాగిస్తున్నారని, ఇది భారత దేశానికి అత్యంత ప్రమాదకరమని కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరీ శుక్రవారం విమర్శించారు. వాజపేయి ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన శౌరీ ఇటీవలి కాలంలో బిజెపికి దూరమవుతూ వస్తున్న విషయం తెలిసిందే.

05/07/2016 - 07:11

పాలక్కాడ్/చెన్నై, మే 6: అగస్టా వెస్ట్‌లాండ్ ముడుపుల కుంభకోణంలో దోషులెంతటివారయినా వదిలేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇటలీ మూలాలను ప్రస్తావించడం ద్వారా ఆమెపై పరోక్షంగా విమర్శలు సంధించారు. అగస్టా హెలికాప్టర్ల కొనుగోలులో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ ఇటలీ కోర్టు తీర్పు ఇచ్చిన అంశంపై వౌనం వీడిన మోదీ ఈ మొత్తం వ్యవహారాన్ని చౌర్యంగా అభివర్ణించారు.

05/07/2016 - 05:43

న్యూఢిల్లీ, మే 6: వివిఐపి హెలికాప్టర్ల కొనుగోలు ప్రక్రియలో అగస్టా వెస్ట్‌లాండ్ కంపనీకి ప్రయోజనం కలిగే రీతిలో గత యుపిఏ ప్రభుత్వం వ్యవహరించిందని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఆరోపించారు. రూ.3600 కోట్ల విలువ గల ఒప్పందంలో ఒకే విక్రేత ఉండే పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ కల్పించిందని, తద్వారా అగస్టా వెస్ట్‌లాండ్ కంపనీకే కాంట్రాక్టు దక్కేలా చూసిందని ధ్వజమెత్తారు.

05/07/2016 - 04:17

న్యూఢిల్లీ, మే 6: సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ (వైద్య) నిర్వహణకు మార్గం సుగమమైంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ కళాశాలల్లో వైద్య విద్య కోర్సులకు ఈ ఏడాది ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎంసెట్-మెడికల్) నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.

05/07/2016 - 03:59

న్యూఢిల్లీ, మే 6: తెలంగాణలో నిర్మించనున్న పాలమూరు- రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలపై తెలుగు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల నిర్మాణంతో తమప్రాంత ప్రయోజనాలకు భంగంవాటిల్లే ప్రమాదం ఉందంటూ గుంటూరు రైతులు దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది.

05/07/2016 - 06:20

న్యూఢిల్లీ, మే 6: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించడానికి కేంద్రం సంసిద్ధత తెలియజేయడంతో రాష్ట్ర అసెంబ్లీలో ఈ నెల 10న బలపరీక్ష జరపాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. బలపరీక్ష జరిగే సమయంలో ఉత్తరాఖండ్‌లో రెండు గంట ల పాటు తాత్కాలికంగా రాష్టప్రతి పాలన ఎత్తివేయాలని న్యాయస్థానం స్పష్టం చేస్తూ ఈ నెల 10వ తేదీన ఉదయం 11గంటలనుంచి మధ్యా హ్నం ఒంటిగంట మధ్య బలపరీక్ష జరగాలని తెలిపింది.

05/07/2016 - 03:45

ఆరెస్సెస్ కనుసన్నల్లో పనిచేస్తున్న మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాసేందుకు చేస్తున్న ప్రయత్నాలను సాగనిచ్చేది లేదని కాంగ్రెస్
అధినేత్రి సోనియాగాంధీ ప్రకటించారు. ప్రజాస్వామ్యం పరిరక్షణ పేరిట
శుక్రవారం జంతర్‌మంతర్ నుంచి పార్లమెంట్‌కు కాంగ్రెస్ మార్చ్ నిర్వహించింది. మార్చ్‌లో పార్లమెంటు వైపు దూసుకెళ్తూ స్వచ్ఛందంగా అరెస్టవుతున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ,

05/06/2016 - 18:10

దిల్లీ: విశాఖ కేంద్రంగా ఎపికి రైల్వేజోన్‌ను ఏర్పాటు చేయాలని వైకాపా ఎంపీలు శుక్రవారం ఇక్కడ రైల్వేమంత్రి సురేష్ ప్రభును కలిసి విన్నవించారు. నాలుగు రైల్వే డివిజన్లు ఉన్నప్పటికీ ఎపిలో జోన్ లేదన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి ఎపిని ఆదుకోవాలని వారు కోరారు.

05/06/2016 - 18:09

దిల్లీ: సహారా గ్రూపు సంస్థల అధిపతి సుబ్రతారాయ్‌కు నెలరోజుల పెరోల్ మంజూరైంది. ఆయన తల్లి 95 ఏళ్ల ఛాబీ రాయ్ లక్నోలో అనారోగ్యంతో మరణించారు. ఆమె అంత్యక్రియలకు, కర్మకాండలకు హాజరయ్యేందుకు జైలు అధికారులు సుబ్రతారాయ్‌కు అనుమతి మంజూరు చేశారు. ఖాతాదారులకు వేల కోట్ల రూపాయల్లో డిపాజిట్లు ఎగవేసినందుకు గత రెండేళ్లుగా ఆయన ఇక్కడి తిహార్ జైలులో ఉంటున్నారు.

Pages