S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/06/2016 - 02:57

కోల్‌కతా, మే 5: పశ్చిమ బెంగాల్‌లో గురువారం జరిగిన ఆరవ తుది విడత అసెంబ్లీ ఎన్నిల్లో సాయం త్రం 5 గంటల వరకు 84 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తూర్పు మిడ్నపూర్ జిల్లాలో 85.09 శాతం పోలింగ్ నమోదు కాగా, కూచ్ బిహార్ జిల్లా లో 82.71 శాతం ఓట్లు పోలయ్యాయి. సాయం త్రం 5 గంటల వరకు మొత్తంమీద సగటున 84.24 శాతం పోలింగ్ జరిగింది.

05/06/2016 - 02:50

న్యూఢిల్లీ, మే 5: గత ఫిబ్రవరి 9న జెఎన్‌యు క్యాంపస్‌లో జరిగిన సంఘటనకు సంబంధించి యూనివర్శిటీ అధికారులు విద్యార్థులకు విధించిన శిక్షలకు నిరసనగా గత ఎనిమిది రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను గురువారం యూనివర్శిటీ ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

05/06/2016 - 02:48

ఉజ్జయిని, మే 6: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరుగుతున్న కుంభమేళా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. వడగళ్లతో కురిసిన భారీ వర్షానికి కుంభమేళా ప్రాంతంలో యాత్రికులు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న టెంట్లు కుప్ప కూలడం, పిడుగులు పడ్డంతో కనీసం ఏడుగురు చనిపోగా, 90 మందికి పైగా గాయపడ్డారు.

05/05/2016 - 18:09

దిల్లీ: క్రమశిక్షణ చర్యల కింద తనతో పాటు మరికొందరు విద్యార్థులకు జెఎన్‌యు యాజమాన్యం జరిమానాలు విధించినందుకు నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్న జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. దీంతో ఆయనను గురువారం నాడు ఆస్పత్రికి తరలించారు.

05/05/2016 - 18:08

పనాజీ: పదహారేళ్ల నేపాలీ బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గోవా ఎమ్మెల్యే అటాసినో మోన్సరేట్ గురువారం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. దీంతో అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మానవ అక్రమ రవాణా, అత్యాచారం అభియోగాలపై కేసులు నమోదు చేశారు. సవతి తల్లి ఆ బాలికను ఎమ్మెల్యేకు విక్రయించగా అతను తన దుకాణంలో పనికి కుదిర్చి అత్యాచారం చేసినట్లు ఆరోపణలున్నాయి.

05/05/2016 - 17:09

దిల్లీ: ఎపిలో జాతీయ ప్రాజెక్టుగా చేపట్టిన పోలవరం పథకానికి అవసరమైన నిధులను తమ ప్రభుత్వమే కేటాయిస్తుందని కేంద్ర జలవనరుల శాఖా మంత్రి ఉమాభారతి గురువారం తెలిపారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు తమదే బాధ్యత అని, ఈ పథకంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న ఒడిశా ఎంపీలతో తాను సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆమె చెప్పారు.

05/05/2016 - 17:07

దిల్లీ: పదవీచ్యుతుడైన ఉత్తరాఖండ్ సిఎం హరీష్ రావత్‌కు కొత్తకష్టాలు ప్రారంభమయ్యాయి. ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలనను నైనిటాల్ హైకోర్టు రద్దు చేసినా ఆ ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో బలపరీక్ష కోసం నిరీక్షిస్తున్న రావత్‌కు ఇపుడు సిబిఐ సమన్లు పంపింది. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు రావత్ డబ్బుల్ని ఎరవేశారంటూ ‘స్ట్రింగ్ ఆపరేషన్’లో ఓ వీడియో బయటకు వచ్చింది.

05/05/2016 - 17:05

దిల్లీ: భారత వైమానిక దళం మాజీ అధిపతి త్యాగిని అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంటు డిపార్టుమెంటు (ఈడీ) అధికారులు గురువారం సుదీర్ఘంగా విచారిస్తున్నారు. హెలికాప్టర్ల కొనుగోలులో మధ్యవర్తుల ప్రమేయం, వారికి ముడుపులు, ఇతర ఆర్థిక లావాదేవీల గురించి ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో మరికొంతమంది అధికారులను కూడా ఈడీ విచారించే అవకాశం ఉంది.

05/05/2016 - 15:11

దిల్లీ: అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంపై సిబిఐ చేత విచారణ జరిపించాలని అప్పట్లో సుప్రీం కోర్టు ఆదేశించినా కాంగ్రెస్ సర్కారు ఎందుకు పట్టించుకోలేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల స్వార్థంతోనే హెలికాప్టర్ల కొనుగోలులో అక్రమాలు జరిగాయన్నారు. ఆనాడు విచారణ జరిపి ఉంటే నిజానిజాలు ఎప్పుడో వెలుగు చూసి ఉండేవన్నారు.

05/05/2016 - 15:09

పనాజీ: ఓ మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోవా మాజీ విద్యాశాఖ మంత్రి, బహిష్కృత కాంగ్రెస్ ఎమ్మెల్యే అటాసినో మోన్సరేట్‌పై స్థానిక పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసి క్రైమ్ బ్రాంచికి విచారణ బాధ్యతలు అప్పగించారు. ఆ ఎమ్మెల్యే తన దుకాణంలో పని ఇస్తానని చెప్పి పలుసార్లు అత్యాచారం చేసినట్లు బాలిక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Pages