S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/05/2016 - 15:09

దిల్లీ: ఎపికి ఇవ్వాల్సిన నిధులన్నీ ఇస్తున్నామని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి ఉన్నందునే ఆర్థిక కేటాయింపులు చేస్తున్నామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఆయన గురువారం లోక్‌సభలో మాట్లాడుతూ, ఎపికి తొలి ఏడాది రెవెన్యూ లోటు కింద 2,800 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు.

05/05/2016 - 15:08

హైదరాబాద్: కింగ్‌ఫిషర్ అధినేత విజయ్‌మాల్యాపై చెక్‌బౌన్స్ కేసును ఎర్రమంజిల్ కోర్టు ఈనెల 9వ తేదీకి వాయిదా వేసింది. ఆయన గురువారం నాడు కోర్టుకు హాజరుకానందున కేసు విచారణ వాయిదా పడింది. జిఎంఆర్ సంస్థకు 22.5 కోట్ల రూపాయలను మాల్యా బకాయిపడి 15 చెక్కులు ఇవ్వగా అవి బ్యాంకుల్లో బౌన్స్ అయినట్లు అభియోగాలు నమోదయ్యాయి.

05/05/2016 - 12:19

రాయ్‌పూర్: గద్వా నుంచి రాయ్‌పూర్ వస్తున్న ఓ ప్రైవేటు బస్సు బుధవారం అర్ధరాత్రి వేళ దఢోరా ఘాట్‌రోడ్‌పై ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 13 మంది మరణించగా 53 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బస్సు ప్రమాదంపై చత్తీస్‌గఢ్ సిఎం రమణ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

05/05/2016 - 12:18

కోల్‌కత: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరిదశ పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. ఇంతవరకూ అయిదు విడతల పోలింగ్ జరిగింది. చివరి దశలో 25 నియోజకవర్గాలకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని ఎన్నికల అధికారులు తెలిపారు. 6,774 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు.

05/05/2016 - 12:15

చెన్నై: ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం చేసినందుకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, సినీనటి కుష్బూ, ఆ పార్టీ అభ్యర్థి విజయతరణిపై తమిళనాడు ఎన్నికల అధికారులు కేసు నమోదు చేశారు. కన్యాకుమారి జిల్లా కుళిత్తురైలో బుధవారం నాడు విజయతరణికి మద్దతుగా ఓపెన్ టాప్ జీపులో ప్రయాణించి ఖుష్బూ ఎన్నికల ప్రచారం చేశారు.

05/05/2016 - 05:33

న్యూఢిల్లీ,మే 4: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు.

05/05/2016 - 05:30

న్యూఢిల్లీ, మే 4: దేశరాజధాని న్యూఢిల్లీలో ఉగ్రదాడుల కుట్రను పోలీసులు బుధవారం భగ్నం చేశారు. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి 12మంది టెర్రరిస్టులను అరెస్టు చేశారు. జైష్ ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి నిఘావర్గాలు అందించిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఢిల్లీ పోలీసు ప్రత్యేక సెల్‌కు చెందిన 12 ప్రత్యేక బృందాలు బుధవారం ఉదయం నుంచి ఒకేసారి మూకుమ్మడి దాడులు చేశాయి.

05/05/2016 - 05:28

న్యూఢిల్లీ, మే 4: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహిం ఆస్తులను జప్తు చేయాలంటూ ఆరు దేశాలకు భారత్ బుధవారం అధికారిక అభ్యర్థన లేఖలు (లెటర్స్ రొగాటొరీ)లను పంపింది. ముంబయి గొలుసు పేలుళ్లు సహా దేశంలో జరిగిన అనేక నేరాలతో దావూద్‌కు సంబంధం ఉన్న విషయం తెలిసిందే.

05/05/2016 - 05:27

న్యూఢిల్లీ,మే 4: ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాదని చెప్పటం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను మోసం చేస్తున్నారని, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కాంగ్రెస్‌కు పట్టిన గతే బిజెపికి పడుతుందని తెలుగుదేశం సభ్యుడు గల్లా జయదేవ్ హెచ్చరించారు.

05/05/2016 - 04:21

న్యూఢిల్లీ, మే 4: అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం బుధవారం రాజ్యసభలో అధికార, విపక్షాల మధ్య తీవ్రస్థాయ వాగ్యు ద్ధానికి, పరస్పర దాడులకు దారి తీసింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపా లంటూ మొత్తం విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయ.

Pages