S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/04/2016 - 06:44

కోల్‌కతా, మే 3: పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో 244మంది కోటీశ్వరులు పోటీ పడుతున్నారని ఓ సర్వేలో తేలింది. మొత్తం 1961మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా వారిలో 244మంది కోటీశ్వరులని.. వీరిలో 114మంది అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారని ఆసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) విశే్లషణ చేసింది. రెండోస్థానంలో 44మంది కోటీశ్వరులతో బీజేపీ ఉందని..

05/04/2016 - 04:55

63వ జాతీయ సినీ అవార్డుల ప్రదాన కార్యక్రమం న్యూఢిల్లీలో
మంగళవారం సినీ దిగ్గజాలు, తారల తళుకు బెళుకుల మధ్య
సందడిగా సాగింది. బాహుబలి జాతీయ ఉత్తమ చిత్రంగా
ఎంపికైన నేపథ్యంలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న దర్శకుడు రాజవౌళి.

05/04/2016 - 01:56

న్యూఢిల్లీ/ హైదరాబాద్, మే 3: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు (నీట్)పై తాజాగా దాఖలైన పిటిషన్లపై ఆదేశాలకు తొందరేం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో సహా వివిధ రాష్ట్రాలు, ప్రైవేట్ మెడికల్ కళాశాలలు, సీఎంసీ వెల్లూర్ వంటి మైనార్టీ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది.

05/03/2016 - 18:11

దిల్లీ: టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరును ప్రతిష్టాత్మకమైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) సిఫారసు చేసింది. మరో క్రికెటర్ రహానే పేరును అర్జున అవార్డుకు పరిశీలించాలని బిసిసిఐ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

05/03/2016 - 18:05

కోల్‌కత: పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికల్లో మొత్తం 1,941 మంది పోటీ చేస్తుండగా, వీరిలో 244 మంది కోటీశ్వరులున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో పాటు ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఈ అధ్యయనం జరిపారు. నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు ఇచ్చిన ఆస్తిపాస్తుల వివరాలను పరిగణనలోకి తీసుకోగా ఎన్నికల బరిలో 244 మంది కోటీశ్వరులున్నట్టు తేలింది.

05/03/2016 - 18:05

దిల్లీ: గొప్ప నటుడిగా, టిడిపి వ్యవస్థాపకుడిగా జనహృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావుకు ఇకనైనా భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని రాజమండ్రి ఎంపీ, సినీనటుడు మురళీమోహన్ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. ఆయన మంగళవారం లోక్‌సభలో మాట్లాడుతూ, ఎన్టీఆర్‌కు మరణానంతరం భారతరత్న ప్రకటించి తెలుగు ప్రజల మనోభావాలను గుర్తించాలన్నారు.

05/03/2016 - 16:40

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆమెకున్న కోట్లాది రూపాయల ఆస్తులను అమ్మేసి జనం బాధలు తీర్చవచ్చు కదా!.. అని కాంగ్రెస్ ప్రచారకర్త, సినీనటి ఖుష్బూ అన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంచీపురం జిల్లా మధురవాయల్‌లో జరిగిన సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. గత డిసెంబర్‌లో వరదలు వచ్చినపుడు మధురవాయల్ నియోజకవర్గ ప్రజలను జయలలిత ఆదుకోలేదని ఖుష్బూ ఆరోపించారు.

05/03/2016 - 16:38

దిల్లీ: అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో తనను ఇరికించేందుకు బిజెపి రాజకీయ కుట్ర చేస్తోందని అయినా వారికి తాను టార్గెట్ కావడం సంతోషం కలిగిస్తోందని కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ అన్నారు. హెలికాప్టర్ల కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటున్న ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారితో రాహుల్‌కు ఉన్న వ్యవహారాలేమిటో విచారణ జరిపించాలని బిజెపి ఎంపి ఒకరు ఆరోపించారు.

05/03/2016 - 16:38

దిల్లీ: అగస్టా-వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంపై భారత వాయుసేన మాజీ చీఫ్ ఎస్పీ త్యాగిని సిబిఐ అధికారులు రెండోరోజు మంగళవారం కూడా విచారిస్తున్నారు. పదవీ విరమణ చేశాక త్యాగి రెండుసార్లు ఇటలీ వెళ్లి వచ్చారన్న సమాచారంతో ఆయనను సిబిఐ క్షుణ్ణంగా ప్రశ్నిస్తోంది. హెలికాప్టర్ల కుంభకోణంతో ప్రమేయం ఉన్న రాజకీయ నాయకులు, ఇతర అధికారుల గురించి త్యాగిని విచారిస్తున్నారు.

05/03/2016 - 16:38

దిల్లీ: ఈ ఏడాది ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్ సందర్భంగా భారత ఒలింపిక్ సంఘానికి అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అంగీకరించాడు. దేశంలో క్రీడాభివృద్ధికి తనవంతు సాయం చేస్తానని ఆయన భారత ఒలింపిక్ సంఘానికి తెలిపారు. ఒలింపిక్స్ అంబాసిడర్లుగా ఇప్పటికే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, ప్రముఖ షూటర్ అభివన్ బింద్రా ఎంపికయ్యారు.

Pages