S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/02/2016 - 14:47

నైనిటాల్: ఉత్తరాఖండ్‌లోని మూడు జిల్లాల పరిధిలోని అడవుల్లో వ్యాపించిన మంటలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 450 ప్రాంతాల్లో మంటలు వ్యాపించి వేలాది ఎకరాల్లో అటవీ ప్రాంతం దగ్ధమైంది. 70 శాతం మేరకు మంటలు అదుపులోకి వచ్చాయని, ఒకటి రెండు రోజుల్లో మంటల్ని ఆర్పివేస్తామని ఎన్‌డిఆర్‌ఎఫ్ అధికారులు సోమవారం తెలిపారు.

05/02/2016 - 14:46

దిల్లీ: అగస్టా-వెస్ట్‌ల్యాండ్ వివిఐపీ హెలికాప్టర్ల కొనుగోలులో ముడుపులు అందినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న భారత వైమానిక దళం మాజీ అధిపతి త్యాగిని సోమవారం నాడు సిబిఐ అధికారులు ప్రశ్నించారు. హెలికాప్టర్ల కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు ఇటీవల ఇటలీ కోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తీర్పులో త్యాగి పేరును ప్రస్తావించడంతో ఆయన నుంచి వివరాలు రాబట్టాలని సిబిఐ యత్నిస్తోంది.

05/02/2016 - 06:50

బలియా, మే 1: దేశంలో అతి పెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఢంకాను ప్రధాని నరేంద్ర మోదీ మోగించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఐదుకోట్ల పేద కుటుంబాలకు ఉచితంగా ఎల్‌పిజి కనెక్షన్లను అందించే ఎనిమిదివేల కోట్ల రూపాయల భారీ పథకాన్ని ఆదివారం నాడిక్కడ ప్రారంభించారు.

05/02/2016 - 06:48

న్యూఢిల్లీ, మే 1: కార్మికులు లేకుండా పురోగతి సాధించలేమని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురష్కరించుకొని కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేసారు. ‘‘శ్రమయేవ జయతే’’ నినాదం ద్యారా ప్రతి కార్మికుడికి న్యాయబద్ధమైన వ్యవస్థను సృష్టిస్తూ ఉత్తమ అవకాశాలను అందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

05/02/2016 - 06:00

ఒబామా అందగాడు.. చతురుడు! వైట్‌హౌస్‌లో అరుదైన విందుకు హాజరైన అనంతరం బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా
వ్యాఖ్యలివి..ప్రపంచ ప్రముఖులెందరో హాజరైన ఈ విందులో ఒబామా దంపతులతో ప్రియాంక ఛాయాచిత్రమిది.

05/02/2016 - 06:01

సోలార్ విద్యుత్‌తో నడిచే ఈ-బోట్‌ను ఆదివారం వారణాసిలో ప్రారంభించిన ప్రధాని మోదీ అందులోనే ప్రయాణిస్తున్న దృశ్యం

05/02/2016 - 05:55

సిమ్లా/ డెహ్రాడూన్, మే 1: ఉత్తరాఖండ్‌ను వణికిస్తున్న దావానలం ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్‌ను అంటుకుంది. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో అడవులు తగుల బడటంతో వేలాది హెక్టార్లు నాశనం కావడంతో..ఆ మంటలను అదుపు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగిన నేపథ్యంలో ఇప్పటికే హిమాచల్ రాజధాని సిమ్లాలో 50వేల హెక్టార్ల అటవీ భూమి అంటుకు పోయింది.

05/01/2016 - 16:30

వారణాసి:దాదాపు 5కోట్ల మంది పేద మహిళలకు ఉపయోగపడే కొత్త పధకం ప్రధానమంత్రి ఉజ్వలయోజనను ప్రధాని నరేంద్రమోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, సిలెండర్లు పంపిణీ చేశారు. ఈ పథకం వల్ల పేదలకు ఎంతో ఉపయోగం ఉంటుందని ఆయన అన్నారు.

05/01/2016 - 16:29

వారణాసి:కార్మికుల శ్రమవల్లే ఏ దేశమైనా అభివృద్ధి సాధిస్తుందని, తానుకూడా ఒక కార్మికుడినేనని, దేశంలో నెంబర్ వన్ కూలీని తానేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బనాలీ గ్రామంలో జరిగిన మే డే వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.

05/01/2016 - 16:28

న్యూదిల్లి:అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాఫ్టర్ల కొనుగోలులో జరిగిన గోల్‌మాల్ వ్యవహారంపై 4న పార్లమెంటులో గుట్టు విప్పుతానని రక్షణమంత్రి మనోహర్ పారికర్ మీడియాకు చెప్పారు. ఆ ఒప్పందానికి సంబంధించిన అవకతవకలకు సంబంధించిన ఆధారాలు, డాక్యుమెంట్లను సభముందుంచుతానని స్పష్టం చేశారు. యుపిఎ హయాంలో జరిగిన ఈ కుంభకోణంపై ఇప్పటికే పార్లమెంట్‌లో కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటోంది.

Pages