S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/03/2016 - 02:20

న్యూఢిల్లీ, మే 2: నీట్ వ్యవహారంపై ఎన్‌డిఎ ప్రభుత్వం మరోసారి సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు సోమవారం లోక్‌సభలో ఈ విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు.

05/03/2016 - 02:18

న్యూఢిల్లీ, మే 2: కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని టీఆర్‌ఎస్ ఎంపీలు కవిత, వినోద్ కుమార్, జితేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీఎస్ అధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ‘్ఢల్లీ దండోరా’ నినాదంతో ధర్నా నిర్వహించారు. ధర్నాలో టిఆర్‌ఎస్ ఎంపీలు పాల్గొని సంఘీభావం తెలిపారు.

05/03/2016 - 02:11

న్యూఢిల్లీ, మే 2: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సభ్యుడు కెవిపి.రామచందర్‌రావు రాజ్యసభలో ప్రతిపాదించిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు ఆమోదం లభించినప్పటికీ దానిని అమలు చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉండదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.

05/03/2016 - 01:22

న్యూఢిల్లీ, మే 2: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు త్వరలో ఏడవ వేతన కమిషన్ చేసిన సిఫారసుల కంటే అధిక మొత్తంలో వేతనాలను అందుకోనున్నారు. ఏడవ వేతన కమిషన్ సిఫారసులపై సమీక్ష జరిపిన కార్యదర్శుల గ్రూపు ఇప్పటికే తమ నివేదికను సిద్ధం చేసినట్లు తాజా వార్తలు స్పష్టం చేస్తున్నాయి. వేతన కమిషన్ సిఫారసుల కంటే కేంద్ర ఉద్యోగులకు అధిక మొత్తంలో జీతభత్యాలు ఇవ్వాలని ఈ గ్రూపు తమ నివేదికలో సిఫారసు చేయడం ఆశ్చర్యకరమైన అంశం.

05/02/2016 - 18:06

చెన్నై: తనకు పెళ్లి చేయడం లేదన్న ఆగ్రహంతో కన్నతల్లి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేసిన ఓ కుమారుడి ఉన్మాదం ఇది. తమిళనాడులోని అరుంబాక్కంలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. అమర్‌నాథ్ (40) అనే క్యాబ్ డ్రైవర్ తనకింకా పెళ్లి చేయడం లేదని తల్లి శశికళతో తరచూ గొడవపడేవాడు. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన అమర్‌నాథ్ తల్లిని కుర్చీకి కట్టేసి ఆమెకు నిపుపెట్టాడు.

05/02/2016 - 18:03

దిల్లీ: ఎస్సీ వర్గీకరణ విషయమై గతంలో ఇచ్చిన హామీని బిజెపి నిలబెట్టుకోవాలని లేకుంటే రెండు తెలుగురాష్ట్రాల్లో ఆ పార్టీ కనిపించకుండాపోతుందని తెరాస ఎంపీ కవిత అన్నారు. వర్గీకరణ బిల్లుకు తెరాస మద్దతు ఉంటుందని ఆమె సోమవారం ఇక్కడ స్పష్టం చేశారు. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేలా సహకరిస్తానని ఆమె ప్రకటించారు.

05/02/2016 - 16:50

దిల్లీ: అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం రాజ్యసభను సోమవారం కుదిపేసింది. ఈ కుంభకోణం విషయమై రక్షణమంత్రి పారికర్ సభలో స్పష్టమైన ప్రకటన చేయాలంటూ తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సభ్యులు అగస్టాపై చర్చకు ససేమిరా అంటున్నారు. గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్‌లో నిధుల స్వాహాపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీలు పట్టుబట్టారు.

05/02/2016 - 16:50

దిల్లీ: యుపిఎ హయంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని, వాటిని లోక్‌సభలో చర్చించకుండా కాంగ్రెస్ సభ్యులు అడ్డుకుంటూ నీచ రాజకీయాలు చేస్తున్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విమర్శించారు. ఆయన సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం కాంగ్రెస్ పాలనలోనే జరిగిందని, వాటిపై చర్చకు ఆ పార్టీ ఎంపీలు ఎందుకు వెనుకంజ వేస్తున్నారని ప్రశ్నించారు.

05/02/2016 - 14:49

దిల్లీ: డీజిల్, పెట్రోల్‌కు బదులు గ్యాస్ (సిఎన్‌జి)తో నడిచే ట్యాక్సీలను మాత్రమే రోడ్లపై అనుమతించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు అమలులోకి రావడంతో దిల్లీలో సోమవారం నాడు క్యాబ్ డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. గ్యాస్‌తో నడిచేలా ట్యాక్సీలను మార్చుకునేందుకు ఇచ్చిన గడువు గత నెల 30తో ముగిసినందున సుప్రీం ఆదేశాలు మే 1 నుంచి అమలులోకి వచ్చాయి.

05/02/2016 - 14:47

దిల్లీ: మెడికల్ కోర్సులో ప్రవేశానికి కేంద్రం నిర్వహించే ‘నీట్’ (జాతీయ స్థాయి అర్హత పరీక్ష) నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని ఎపి, తెలంగాణ ప్రభుత్వాలు సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాయి. ఆర్టికల్ 370 అమలులో ఉన్నందున ఇతర రాష్ట్రాల వారికి మెడికల్ సీట్లను కేటాయించడం కుదరదని ఎపి, తెలంగాణ ప్రభుత్వాలు కోర్టుకు నివేదించాయి.

Pages