S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/06/2016 - 16:23

దిల్లీ: పదవీచ్యుతుడైన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఈ నెల 10న అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లను కేంద్ర ప్రభుత్వం చేయాలని సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశించింది. కాంగ్రెస్ నుంచి బహిష్కృతులైన 9 మంది ఎమ్మెల్యేలు మాత్రం బలపరీక్షకు అనర్హులని న్యాయస్థానం స్పష్టం చేసింది.

05/06/2016 - 16:22

దిల్లీ: మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లకు ఎంసెట్ తరహా ఎంట్రన్స్‌లను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించుకోవచ్చని సుప్రీం కోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. మెడికల్ కోర్సులకు జాతీయ స్థాయిలో నిర్వహించే ‘నీట్’ ఎంట్రన్స్ నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలంటూ ఎపి, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలు చేసిన అభ్యర్థనలను పరిశీలించాక సుప్రీం ఈ తీర్పు ఇచ్చింది.

05/06/2016 - 14:31

దిల్లీ: అనుమతుల్లేకుండా తెలంగాణలో నిర్మిస్తున్న డిండి, పాలమూరు ప్రాజెక్టుల వల్ల తమకు అన్యాయం జరుగుతుందని ఎపి రైతులు శుక్రవారం సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ ప్రాజెక్టులను నిలిపివేయాలని రైతుల తరఫున హాజరైన న్యాయవాది వాదించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరైనట్లు తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది వివరించారు.

05/06/2016 - 14:28

దిల్లీ: ఉత్తరాఖండ్ శాసనసభలో మాజీ సిఎం హరీష్ రావత్ బలపరీక్ష నిర్వహణకు తాము అన్ని ఏర్పాట్లు చేస్తామని కేంద్రం శుక్రవారం నాడు సుప్రీం కోర్టుకు తెలిపింది. బలపరీక్షకు ఒక పరిశీలకుడిని నియమించాలని, ఆ సమయంలో రాష్టప్రతి పాలన ఎత్తివేయరాదని కేంద్రం కోరింది. రిటైరైన ఎన్నికల ప్రధానాధికారిని పరిశీలకుడిగా నియమించాలని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కోర్టుకు విన్నవించారు.

05/06/2016 - 13:25

న్యూఢిల్లీ, మే 5: వైద్య విద్యకు దేశవ్యాప్త ఉమ్మడి ప్రవేశ పరీక్ష (నీట్) నుంచి తమకు మినహాయింపుఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు వాదనలు వినిపించింది. నీట్ పరీక్ష నిర్యహణపై విచారణను సుప్రీం కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం ధర్మాసనం ముందు వాదనలు వినిపించనుంది.

05/06/2016 - 13:23

న్యూఢిల్లీ, మే 5: ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులను అదుపుచేసేందుకు ఉద్దేశించిన ‘ది క్లీనికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (రిజిష్ట్రైషన్ అండ్ రెగ్యులేషన్ ) 2010 చట్టాన్ని అమలు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు మహమ్మద్ అలీ ఖాన్ డిమాండ్ చేశారు. ఖాన్ గురువారం రాజ్యసభ జీరో అవర్‌లో ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కొనసాగుతున్న దోపిడీ గురించి ప్రస్తావించారు.

05/06/2016 - 12:18

దిల్లీ: నగరంలోని జంతర్‌మంతర్ వద్ద శుక్రవారం ఉదయం ధర్నా జరిపిన అనంతరం పార్లమెంటు భవనంవైపు ర్యాలీగా వెళుతున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, పార్టీ యువనేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితర ప్రముఖులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంటు భవనం వైపు ర్యాలీగా వెళుతూ నిబంధనలను అతిక్రమించారని పోలీసులు కాంగ్రెస్ నేతలకు చెప్పడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

05/06/2016 - 12:17

నైనిటాల్: ఉత్తరాఖండ్‌లోని మూడు జిల్లాల పరిధిలో గురువారం రాత్రి 11-30 గంటల సమయంలో భూమి కంపించింది. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఎక్కడా ఎలాంటి ఆస్తి,ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.1గా నమోదైంది.

05/06/2016 - 12:17

దిల్లీ: కేంద్రంలో ఎన్‌డిఎ సర్కారు ప్రజాస్వామ్య విధానాలను అవలంబిస్తోందని ఆరోపిస్తూ శుక్రవారం ఇక్కడి జంతర్‌మంతర్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్‌ల్లో ప్రభుత్వాలను అనైతిక పద్ధతుల్లో కూల్చివేసి కేంద్రం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తన ప్రసంగంలో ఆరోపించారు.

05/06/2016 - 06:20

హైదరాబాద్, మే 5: ఈ మధ్య ఎక్కడ విన్నా ‘నీట్’ మాటే! దేశవ్యాప్తంగా మెడికల్, డెంటల్ అడ్మిషన్లకు ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించడం మంచిదా కాదా అన్న దానిపై చర్చోపచర్చలు. సుప్రీంలో పిటిషన్ల మీద పిటిషన్లు..! నీట్‌ను నిర్వహించలేమని వాదిస్తున్న రాష్ట్రాల సంఖ్య చాలా తక్కువ కావడం గమనార్హం. జాతీయ స్థాయి జరిగే ఈ పరీక్షను వ్యతిరేకించడం ఆశ్చర్యాన్ని కలిగించేదే!

Pages