S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/07/2016 - 15:46

దిల్లీ: దీక్ష విరమించకపోతే ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు సూచించడంతో పది రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న దిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘ నాయకుడు కన్నయ్యకుమార్‌ శనివారం దీక్షను విరమించారు. దీక్ష విరమించినా ఆందోళన మాత్రం కొనసాగుతుందని జేఎన్‌యూ విద్యార్థి సంఘం వెల్లడించింది.

05/07/2016 - 15:10

చెన్నై: రాజకీయ ప్రయోజనాల కోసం అబ్దుల్‌ కలాం చిత్రపటాలను గాని, పేరును గాని ఉపయోగించరాదని మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కలాం సహాయకుడు పొనరాజ్‌ ‘అబ్దుల్‌ కలాం లక్ష్య ఇండియా’ పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కలాం సోదరుడు మహమ్మద్‌ ముత్తుమీరాన్ హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలు చేశారు.

05/07/2016 - 15:05

న్యూఢిల్లీ : అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంపై ఎయిర్‌ఫోర్సు మాజీ చీఫ్ త్యాగితో పాటు అతని సోదరుల ప్రమేయంపై ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే త్యాగిని సీబీఐ అధికారులు ప్రశ్నించి వివరాలు రాబట్టారు. తాజాగా ఆయన సోదరులు సందీప్, రాజీవ్, సంజయ్‌లను ప్రశ్నిస్తున్నారు.

05/07/2016 - 15:02

దిల్లీ: నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్‌డిఎ సర్కారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంపై ఎందుకు దర్యాప్తు చేపట్టలేదని దిల్లీ సిఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఈ కుంభకోణంలో దోషులను శిక్షించాలంటూ శనివారం ఇక్కడి జంతర్ మంతర్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన ధర్నాలో కేజ్రీవాల్ ప్రసంగించారు.

05/07/2016 - 15:01

చండీగఢ్: పంజాబ్‌లోని లూథియానాలో ఓ వస్త్ర పరిశ్రమలో శనివారం ఉదయం భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది 11 శకటాలతో పరిశ్రమ వద్దకు చేరుకుని ఆరు గంటల పాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

05/07/2016 - 12:12

దిల్లీ: యుపిలో నీటికొరతను నివారించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సమావేశానికి యుపి సిఎం అఖిలేష్ యాదవ్ హాజరు కావడం చర్చనీయాంశమైంది. తాగునీటి సమస్యతో అల్లాడుతున్న యుపికి ఇటీవల కేంద్రం నీటిరైలును పంపగా యుపి సర్కారు తిప్పిపంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని ఏర్పాటు చేసిన సమావేశానికి అఖిలేష్ హాజరు కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

05/07/2016 - 12:11

దిల్లీ: అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని అరెస్టు చేసే సత్తా మోదీ సర్కారుకు ఉందా? అని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ప్రశ్నించారు. అగస్టా వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి, నిందితులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఆప్ ఆధ్వర్యంలో శనివారం ఇక్కడి జంతర్ మంతర్ వద్ద ధర్నా జరిపారు.

05/07/2016 - 12:10

శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్‌లోని పుల్వామాలో సైనికులు, ఉగ్రవాదుల మధ్య శనివారం ఉదయం కాల్పులు జరిగాయి. ఆ ప్రాంతంలో సైనికులు ఆకస్మిక తనిఖీలు చేస్తుండగా ఓ ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన సైనికులు కాల్పులు జరపగా ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. పరారైన ఉగ్రవాదుల కోసం సైనికులు గాలింపు చర్యలు చేపట్టారు.

05/07/2016 - 07:15

న్యూఢిల్లీ, మే 6: నాగ్‌పూర్ కేంద్రం గా పనిచేస్తున్న ఆరెస్సెస్ కనుసన్నల్లో పనిచేస్తున్న మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాల రాచేందుకు చేస్తో న్న ప్రయత్నాలను సాగనిచ్చేది లేదని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రకటించారు. ప్రజాస్వామ్యం పరిరక్షణ పేరిట శుక్రవారం జంతర్‌మంతర్ నుంచి పార్లమెంట్‌కు కాంగ్రెస్ మార్చ్ నిర్వహించింది.

05/07/2016 - 07:13

న్యూఢిల్లీ, మే 6: దేశవ్యాప్తంగా నెలకొన్న కరవు తాండవిస్తున్నా మోదీ సర్కార్‌లో ఎలాంటి స్పందన లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిప్పులు చెరిగారు. ప్రతి రోజూ దాదాపు యాభై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, లా తూర్, విదర్భ మండిపోతున్నా ప్రధా ని నరేంద్ర మోదీ మాత్రం పట్టించుకోవటం లేదని రాహుల్ ఆరోపించారు.

Pages