జాతీయ వార్తలు

కరవును పట్టించుకోరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 6: దేశవ్యాప్తంగా నెలకొన్న కరవు తాండవిస్తున్నా మోదీ సర్కార్‌లో ఎలాంటి స్పందన లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిప్పులు చెరిగారు. ప్రతి రోజూ దాదాపు యాభై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, లా తూర్, విదర్భ మండిపోతున్నా ప్రధా ని నరేంద్ర మోదీ మాత్రం పట్టించుకోవటం లేదని రాహుల్ ఆరోపించారు. కాంగ్రెస్ చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ మార్చ్‌లో రాహుల్‌గాంధీ మాట్లాడుతూ దేశంలో ఇప్పుడు కేవలం నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ మాట మాత్రమే చెల్లుబాటవుతోందని ఆరోపించారు. వీరిని ఎవరు వ్యతిరేకించినా వారిపై తప్పుడు ఆరోపణలు, కేసులు పెడుతున్నారన్నారు. ఇది ఏ ఒక్కరి దేశం కాదు, ఇది అందరి దేశమని రాహుల్ గాంధీ చెప్పారు. ప్రజాస్వామ్యం కోసం, బడుగు బలహీన వర్గాల వారి కోసం కాంగ్రెస్ ఎంతటి త్యాగం చేసేందుకైనా సిద్ధమేనని ఆయన ప్రకటించారు. ప్రధాని మోదీ చెప్పిన మంచిరోజులు ఎక్కడ ఉన్నాయని రాహుల్ ప్రశ్నించారు. యువతకు ఉపాధి కల్పిస్తామంటూ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రతి సంవత్సరం రెండు కోట్ల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని ప్రకటించినా వాస్తవానికి గత సంవత్సరం కేవలం ఒక లక్షా ఇరవై వేల మందికి మాత్రమే ఉపాధి లభించిందని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పంచాయతీల్లో పోటీ చేసేందుకు పదవ తరగతిని అర్హతగా నిర్ణయించటం ద్వారా బడుగు, బలహీన వర్గాలు, మహిళలు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకుండా మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.