S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/09/2016 - 15:42

దిల్లీ: తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి మరింతగా భద్రతను పెంచాలని కాంగ్రెస్ నాయకులు సోమవారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. రాహుల్‌కు ప్రాణహాని ఉందంటూ పుదుచ్చేరి కాంగ్రెస్ నేతలకు ఓ బెదిరింపు లేఖ అందింది. దీంతో పార్టీ నాయకులు అప్రమత్తమై హోం మంత్రిని కలిశారు.

05/09/2016 - 15:39

పాట్నా: అమాయకుడైన ఓ యువకుడిని జెడియు ఎమ్మెల్యే కుమారుడు కాల్చి చంపినందుకు నిరసనగా బిజెపి ఆధ్వర్యంలో గయలో సోమవారం బంద్ జరుగుతోంది. జెడియు శాసనసభ్యురాలు మనోరమాదేవి కుమారుడైన రాఖీకుమార్ యాదవ్ తన కారును ఓవర్‌టేక్ చేశాడని గయలో ఓ యువకుడిని తుపాకీతో కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన ఈ ఘటన బీహార్‌లో సంచలనం సృష్టించింది. బంద్ సందర్భంగా గయలో దుకాణాలను బిజెపి కార్యకర్తలు మూసివేయించారు.

05/09/2016 - 15:37

దిల్లీ: తమిళనాడు ఎన్నికల ప్రచారం సందర్భంగా తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేశారు. మోదీ వ్యాఖ్యలకు నిరసనగా వారు సభ నుంచి వాకౌట్ చేశారు.

05/09/2016 - 15:37

దిల్లీ: అసెంబ్లీలో జరిగే బలపరీక్షకు తమను అనర్హులుగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై 9 మంది బహిష్కృత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈరోజు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ఆదేశాలను రద్దు చేసి, తాము బలపరీక్షకు హాజరయ్యేందుకు అనుమతించాలని కోరుతూ వీరు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత సుప్రీం కోర్టు విచారిస్తుంది.

05/09/2016 - 12:44

రాంచీ: ఝార్ఖండ్ రాజధాని రాంచీలో సోమవారం ఉదయం ప్రయాణీకులతో వెళుతున్న ఓ బస్సు బోల్తాపడి ఏడుగురు మరణించారు. ఈ ఘటనలో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.

05/09/2016 - 12:43

దిల్లీ: అగస్టా కుంభకోణంపై ప్రధాని నరేంద్ర మోదీ సభకు వచ్చి వివరణ ఇవ్వాలంటూ కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టడంతో సోమవారం రాజ్యసభలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ ఎంపీలు తమ డిమాండ్‌ను వినిపిస్తూ పదేపదే నినాదాలు చేశారు. సభకు రావాల్సిందిగా ప్రధానమంత్రిని తాను ఆదేశించలేనని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ స్పష్టం చేశారు.

05/09/2016 - 12:42

దిల్లీ: ఎపుడూ విచిత్ర వేషధారణలతో వినూత్న నిరసనలకు దిగే నటుడు, టిడిపి ఎంపీ సోమవారం దిల్లీలో అంబేద్కర్ వేషధారణలో కనిపించారు. భారత రాజ్యాంగాన్ని ఇప్పటివరకూ ఎన్నోసార్లు సవరించారని, ఎపికి ప్రత్యేక హోదా కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనని ఆయన అన్నారు. అంబేద్కర్ వేషధారణతో ఆయన పార్లమెంటు భవనం వద్ద సందడి చేశారు.

05/09/2016 - 12:40

నైనిటాల్: తొమ్మిది మంది కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యేలు ఈ నెల 10న అసెంబ్లీలో జరిగే బలపరీక్షకు అనర్హులని ఉత్తరాఖండ్ హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఊరట లభించింది. రాష్టప్రతి పాలన విధించడంతో పదవీచ్యుతుడైన ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఈనెల 10న అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధం కావాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

05/09/2016 - 08:26

న్యూఢిల్లీ, మే 8: దేశంలోనే అతిపెద్ద పారా మిలిటరీ దళమైన సిఆర్‌పిఎఫ్ తన బలగాల్లో లింగ వివక్షకు రూపుమాపే దిశగా మరో అడుగు వేసింది. దేశంలోని వామపక్ష తీవ్రవాద ప్రాబల్యం గల రాష్ట్రాలలో నక్సలైట్ల వ్యతిరేక ఆపరేషన్లను నిర్వహించడానికి 567 మంది మహిళా కమాండోలను మోహరించనుంది.

05/09/2016 - 08:12

న్యూఢిల్లీ, మే 8: కృష్ణా జలాల వివాదం పరిష్కరించే బ్రిజేస్ కుమార్ ట్రిబ్యునల్‌లో సోమవారం నుండి మూడు రోజుల పాటు వాదనలు జరగనున్నాయి. బ్రిజేస్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కృష్ణా నదీ పరివాహక రాష్ట్రాలయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలు వాదనలు వినిపించేందుకు సిద్ధం అవుతున్నాయి. నాలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ నీటి పంపకాలు జరపాలని ఆంధ్ర, తెలంగాణలు ఇప్పటికే టిబ్యునల్ స్పష్టం చేసాయి.

Pages