జాతీయ వార్తలు

నక్సలైట్ల ఏరివేతలో మహిళా జవాన్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 8: దేశంలోనే అతిపెద్ద పారా మిలిటరీ దళమైన సిఆర్‌పిఎఫ్ తన బలగాల్లో లింగ వివక్షకు రూపుమాపే దిశగా మరో అడుగు వేసింది. దేశంలోని వామపక్ష తీవ్రవాద ప్రాబల్యం గల రాష్ట్రాలలో నక్సలైట్ల వ్యతిరేక ఆపరేషన్లను నిర్వహించడానికి 567 మంది మహిళా కమాండోలను మోహరించనుంది. దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా ఉన్న నక్సలైట్ల సవాలును ఎదుర్కొనే ఆపరేషన్లలో మోహరించడానికి రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో గత వారం శిక్షణ పూర్తి చేసుకున్న సిఆర్‌పిఎఫ్ మహిళా సిబ్బందిని ఎంపిక చేసింది. ఈ 567 మందిని దశలవారీగా వామపక్ష తీవ్రవాద ప్రాబల్యం గల ప్రాంతాలలో మోహరిస్తామని సిఆర్‌పిఎఫ్ డైరెక్టర్ జనరల్ కె.దుర్గాప్రసాద్ ఒక వార్తాసంస్థకు చెప్పారు. ‘కంపనీగా రూపొందించిన’ తరహాలో అంటే ఏకకాలంలో వంద మంది మహిళా సిబ్బందిని నక్సలైట్ల ప్రాబల్యం గల ప్రాంతాలకు విధి నిర్వహణకు పంపిస్తామని, ఆ బ్యాచ్ వెనక్కి రాగానే తిరిగి మరో వంద మందితో కూడిన బ్యాచ్‌ని పంపిస్తామని ఆయన వివరించారు. ఈ నెల 6న శిక్షణ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన ఈ 567 మందికి వామపక్ష తీవ్రవాదవాదులను ఏరివేసే లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ 567 మందికి సర్వీసు తొలినాళ్లలో కష్టసాధ్యమైన విధులను అప్పగించాలని తాము యోచించినట్లు ఆయన చెప్పారు. నిర్దిష్టమైన ప్రాంతాలలో ఈ మహిళా సిబ్బందికోసం వౌలిక సౌకర్యాలను, బ్యారక్‌లను ఏర్పాటు చేసినట్లు దుర్గాప్రసాద్ తెలిపారు. రానున్న కాలంలో ఇలాంటి మరిన్ని సౌకర్యాలను కల్పిస్తామని ఆయన చెప్పారు. మావోయిస్టు శ్రేణుల్లో మహిళలు ఉండగా, భద్రతా బలగాలలో మహిళలు ఎందుకు ఉండకూడదనే భావనతో వామపక్ష తీవ్రవాద ప్రాబల్యం గల ప్రాంతాలలో మహిళా సిబ్బందిని మోహరిస్తున్నామని సిఆర్‌పిఎఫ్ అధికారులు వివరించారు.