S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/10/2016 - 03:27

న్యూఢిల్లీ, మే 9: ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల అఫిడవిట్‌లో చూపిన డిగ్రీలన్నీ నకిలివేనంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న ఆరోపణలను బిజెపి అధినాయకత్వం కొట్టిపారేసింది. కేజ్రీవాల్ దురుద్దేశంతోనే విమర్శలు చేస్తున్నారన్న బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీలు ప్రధాని మోదీ బిఏ, ఎంఏ డిగ్రీలు సోమవారం ఢిల్లీలో విడుదల చేశారు.

05/10/2016 - 03:25

న్యూఢిల్లీ, మే 9: ‘‘మా నాయకురాలిపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేసిన ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాల్సిందే. ‘ఫేకూ’ మామా మాఫీ మాంగే.. (అబద్ధాలు చెప్పిన మోదీ క్షమాపణ చెప్పండి). మీరు క్షమాపణ చెప్పేంతవరకు సభ జరిగే సమస్యేలేదు..’’ పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రధాన విపక్షం కాంగ్రెస్ పార్టీ సోమవారం చేసిన హంగామా ఇది.

05/10/2016 - 03:23

న్యూఢిల్లీ, మే 9: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని హతమారుస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చిన నేపథ్యంలో రాహుల్ సహా కాంగ్రెస్ అగ్ర నేతలకు భద్రతను పెంచాలని ఆ పార్టీ ప్రతినిధుల బృందం సోమవారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరింది. రాహుల్ గాంధీని హతమారుస్తామని పేర్కొంటూ ఒక బెదిరింపు లేఖ కాంగ్రెస్ పార్టీ పుదుచ్చేరి శాఖ అధ్యక్షుడికి అందింది.

05/10/2016 - 03:22

భద్రాచలం, మే 9: చత్తీస్‌గఢ్‌లో సోమవారం ప్రెషర్ బాంబు పేలిన ఘటనలో కోయ కమాండర్ మృతి చెందాడు. సుక్మా జిల్లా కుంట బ్లాకులోని మారాయిగూడెం పోలీస్ స్టేషన్‌కు 5 కిలోమీటర్ల దూరంలో రోడ్డు నిర్మాణం జరుగుతోంది. అక్కడకు భద్రతగా జవాన్లు వెళ్లారు. తొలుత 11.30 గంటల సమయంలో ఒక ప్రెషర్ బాంబు పేలింది.

05/10/2016 - 03:21

న్యూఢిల్లీ, మే 9: విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలన్నీ సాధించి తీరుతామని టిడిపి ఎంపీలు స్పష్టం చేశారు. విభజన హామీలు అమలు చేయడంతో పాటు, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ విభజన డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ భారీ ధర్నా జరిగింది.

05/10/2016 - 03:19

త్రిసూర్ (కేరళ), మే 9: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను రాజ్యాంగ విరుద్ధంగా మోదీ సర్కార్ కూల్చేస్తోందంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్రస్వరంతో విరుచుకుపడ్డారు. కేరళలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సోనియా గాంధీ ప్రజాప్రభుత్వాలను కూలదోయడం ద్వారా వక్రమార్గం ద్వారా అందలం ఎక్కాలని మోదీ ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. సిపిఎం సారధ్యంలోని ఎల్‌డిఎఫ్‌పైనా విరుచుకుపడ్డారు.

05/10/2016 - 03:16

న్యూఢిల్లీ, మే 9: దేశంలో ఈ విద్యాసంవత్సరం ఓపెన్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో పది భాషల్లో కలిపి 500 ఉచిత కోర్సులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ సోమవారం వెల్లడించారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆమె ఈ విషయం చెప్పారు.

05/10/2016 - 03:09

న్యూఢిల్లీ, మే 9: లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సోమవారం సభలో విశ్వరూపం ప్రదర్శించారు. సభలో అన్‌పార్లమెంటరీ అలాగే క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించేది లేదని ఆమె తీవ్ర హెచ్చరిక చేశారు. సభ నియమ, నిబంధనలు ఉల్లంఘన, దూషణకు దిగడంపై సభ్యులకు ఆమె క్లాసు తీసుకున్నారు.

05/10/2016 - 02:56

న్యూఢిల్లీ,మే 9: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టలో సెక్షన్ 89 ప్రకారం నాలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ నీటి పంపకాలు జరపాలని కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్ ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదనలు వినిపించింది. సోమవారం కృష్ణా నదీ జలాలల వివాదం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు జరిగాయి.

05/10/2016 - 01:49

న్యూఢిల్లీ, మే 9: అపాయింటెడ్ తేదీ తరువాత రాష్ట్రంలో ఎలాంటి కొత్త నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టలేదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి తెలిపిందని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సోమవారం వెల్లడించారు. టిడిపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

Pages