జాతీయ వార్తలు

ఇవిగో మోదీ డిగ్రీ సర్ట్ఫికెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 9: ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల అఫిడవిట్‌లో చూపిన డిగ్రీలన్నీ నకిలివేనంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న ఆరోపణలను బిజెపి అధినాయకత్వం కొట్టిపారేసింది. కేజ్రీవాల్ దురుద్దేశంతోనే విమర్శలు చేస్తున్నారన్న బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీలు ప్రధాని మోదీ బిఏ, ఎంఏ డిగ్రీలు సోమవారం ఢిల్లీలో విడుదల చేశారు. బిజెపి కార్యాలయంలో మోదీ సర్ట్ఫికెట్లు బయటపెట్టిన నేతలిద్దరూ ఢిల్లీ సిఎంపై విమర్శలు గుప్పించారు. ప్రధానిపై తప్పుడు ఆరోపణలు చేసిన సిఎం అరవింద్ కేజ్రీవాల్ తక్షణం దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని షా, జైట్లీ డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి విద్యార్హతలపై ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని వారు అభిప్రాయపడ్డారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బిజెపి నేతలు ఆరోపించారు. కేజ్రీవాల్ తప్పుడు ఆరోపణలను తిప్పకొట్టాలన్న ఉద్దేశంతోనే తాము నరేంద్ర మోదీ బిఏ, ఎంఏ డిగ్రీ సర్ట్ఫికెట్లును విడుదల చేయాల్సి వచ్చిందని వారు స్పష్టం చేశారు. మోదీ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బిఏ చేశారని, గుజరాత్ వర్శిటీ నుంచి ఎంఏ పూర్తిచేశారని అమిత్‌షా, అరుణ్ జైట్లీ వివరించారు. ప్రధానిపై కేజ్రీవాల్ చౌకబారు రాజకీయం చేస్తున్నారని, మోదీని అప్రతిష్టపాలు చేసేందుకు రకరకాలు ఎత్తులు వేస్తున్నారని బిజెపి నేతలు విమర్శించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పని చేసిన అరుణ్ జైట్లీ మాట్లాడుతూ నరేంద్ర మోదీ కాలేజీకి రావడం తనకింకా గుర్తుందని చెప్పటం గమనార్హం. మోదీ 1975-77 సంవత్సరంలో దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పరీక్షలకు హాజరయ్యారని ఆర్థిక మంత్రి చెప్పుకొచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఇద్దరు, ముగ్గురు మంత్రులు, శాసన సభ్యులు తప్పుడు డిగ్రీ సర్ట్ఫికెట్లు కేసులో ఇరుకున్న సంగతి తెలిసిందే. ఆ కేసులను ప్రస్తావించిన అమిత్ షా, జైట్లీ ‘ఇలాంటి వారికి ప్రధాన మంత్రిపై ఆరోపణలు చేసే అధికారం లేదు’ అని ధ్వజమెత్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ మోసాలకు పుట్టినిల్లు అని బిజెపి నేతలు విరుచుకుపడ్డారు. వారే మోసాలకు పాల్పడుతూ ఇతరులపై ఆరోపణలు చేయటం ఏమిటని ప్రశ్నించారు. కాగా నరేంద్ర మోదీ డిగ్రీ సర్ట్ఫికెట్ కాపీలు, మార్కుల షీట్ కాపీలను అమిత్ షా విలేఖరులకు పంచిపెట్టారు. ‘ప్రధాన మంత్రి విద్యార్హతలపై వివరణ ఇవ్వవలసి వచ్చినందుకు సిగ్గు పడుతున్నాం. అయితే కేజ్రీవాల్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఇలా చేయాల్సి వచ్చింది’ అని వారు పేర్కొన్నారు.

చిత్రం ఢిల్లీలో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ పట్టాలను చూపుతున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ