జాతీయ వార్తలు

కొత్త నీటి పథకాలపై సమాచారం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 9: అపాయింటెడ్ తేదీ తరువాత రాష్ట్రంలో ఎలాంటి కొత్త నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టలేదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి తెలిపిందని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సోమవారం వెల్లడించారు. టిడిపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పాలమూరు- రంగారెడ్డి- నక్కలగండి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన సాంకేతిక, ఆర్థిక ప్రతిపాదన ఏదీ తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు అందలేదని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు- రంగారెడ్డి, నక్కలగండి ఎత్తిపోతల పథకాన్ని చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నది నిర్వహణా బోర్డు,కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు చేసిందని ఉమాభారతి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 84(3),85(8),11 షెడ్యూలులోని 7వ పేరాకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్లు ఏపి తన ఫిర్యాదులో తెలిపిందని ఆమె అన్నారు.