S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/11/2016 - 06:20

న్యూఢిల్లీ, మే 10: ఉగ్రవాదాన్ని నిర్వచించే విషయంలో భిన్నాభిప్రాయలు వ్యక్తం చేయనక్కర్లేదని చైనాకు భారత్ సూచించింది. జైషే ఉగ్రవాద సంస్థ చీఫ్ మహ్మద్ మసూద్ అజార్ విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై చైనాకు తమ నిరసన తెలిపినట్టు కేంద్రం లోక్‌సభకు తెలిపింది. జైషే చీఫ్ మసూద్‌ను ఐరాసా భద్రతా మండలి కమిటీ ఉగ్రవాదిగా పరిగణించకుండా చైనా తన వీటో అధికారంతో అడ్డుకుంటున్న నేపథ్యంలో మంగళవారం లోక్‌సభకు వివరణ ఇచ్చింది.

05/11/2016 - 06:19

చెన్నై, మే 10: తమిళనాడు శాసనసభకు ఈ నెల 16వ తేదీన జరిగే ఎన్నికల్లో డిఎంకె విజయం సాధిస్తే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తానేనని ఆ పార్టీ అధినేత ఎం.కరుణానిధి (93) మంగళవారం వెల్లడించారు. తాను మరణించే వరకు తన కుమారుడు ఎంకె.స్టాలిన్ ముఖ్యమంత్రి పదవికోసం ఎదురు చూడాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ‘ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాలని స్టాలిన్ కూడా కోరుకోవడం లేదు.

05/11/2016 - 06:17

న్యూఢిల్లీ, మే 10: రాజ్యసభ కార్యకలాపాల్లో అధికార, ప్రధాన విపక్షాలకు తప్ప మిగతా పార్టీలకు గుర్తింపు లేకుండా పోతోందని సమాజ్‌వాదీ సభ్యురాలు జయాబచ్చన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్టప్రతి పాలన అమల్లో ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించిన బిల్లుపై అధికార బీజేపీ, ప్రధాన విపక్షం కాంగ్రెస్‌ల మధ్య పెద్దఎత్తున నినాదాలు.. వాగ్యుద్ధం జరుగుతున్న సమయంలో జయాబచ్చన్ తీవ్రంగా స్పందించారు.

05/11/2016 - 06:15

న్యూఢిల్లీ, మే 10: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌సియు)లో ఆత్మహత్య చేసుకున్న పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల సోదరునికి పరిహార కారణాలతో ఉద్యోగం ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలైంది.

05/11/2016 - 06:14

న్యూఢిల్లీ, మే 10: ఉత్తరాఖండ్‌లో బలపరీక్ష ప్రజాస్వామ్యానికి విజయమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అభివర్ణించారు. మంగళవారం ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష ముగిసిన తర్వాత సోనియా మీడియాతో మాట్లాడారు. బుధవారం సుప్రీంకోర్టు అధికారికంగా ఫలితాలను ప్రకటించిన తర్వాత పార్టీ వైఖరి తెలియజేస్తామని పార్టీ ప్రతినిధి అభిషేక్ సింఘ్వి చెప్పారు.

05/11/2016 - 06:13

న్యూఢిల్లీ, మే 10: కృష్ణా నదిపై చిన్నచిన్న ప్రాజెక్టులు నిర్మించి మహారాష్ట్ర, కర్ణాటక జలదోపిడీ చేసున్నాయని తెలంగాణ ఆరోపించింది. ఈ విషయమై తెలంగాణ తరఫున న్యాయవాది వైద్యనాథన్ మంగళవారం కృష్ణా ట్రిబ్యునల్ ముందు వాదన వినిపించారు. కృష్ణా ఎగువ రాష్ట్రాల జల దోపిడీని అరికట్టేందుకు ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరపాలని కోరారు.

05/11/2016 - 06:13

న్యూఢిల్లీ, మే 10: దేశంలో, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా నివారించేందుకు యుద్ధ ప్రాపతిపదికపై చర్యలు చేపట్టాలని వైకాపా లోక్‌సభ పక్షం నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం లోక్‌సభలో కరవుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ, ప్రజలకు తాగు నీటిని అందించలేని ప్రభుత్వాలు ఉంటే ఎంత, పోతే ఎంత అని ఆయన విమర్శించారు.

05/11/2016 - 06:12

న్యూఢిల్లీ, మే 10: ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీఎస్ ఢిల్లీలో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం మూడో రోజుకు చేరుకొన్నాయి. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లు విధానానికి కాలం చెల్లిందని అన్నారు. అందుకే దళితుల మధ్య అసమానతలు, అంతరాలు వస్తున్నాయన్న కృష్ణ మాదిగ నూతన రిజర్వేషన్లు విధానం రావాలన్నారు.

05/11/2016 - 06:12

పనాజీ, మే 10: ఖనిజాల తవ్వకంలో అక్రమాలను నిరోధించడం, ఇ-వేలం ద్వారా గనులను కేటాయించడం తదితర అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 27వ తేదీన గోవాలో అన్ని రాష్ట్రాలతో కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. గోవా రాష్ట్ర గనులు, భూగర్భ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు.

05/11/2016 - 06:11

న్యూఢిల్లీ, మే 10: విజయవాడ ప్రకాశం బ్యారేజీపై భారీ వాహనాలను అనుమంతించొద్దంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. వైకాపా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ టిఎస్ ఠాకుర్, జస్టిస్ ఆర్.్భనుమతి, జస్టిస్ యూవి లలిత్‌లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది.

Pages