జాతీయ వార్తలు

తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా నివారించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: దేశంలో, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా నివారించేందుకు యుద్ధ ప్రాపతిపదికపై చర్యలు చేపట్టాలని వైకాపా లోక్‌సభ పక్షం నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం లోక్‌సభలో కరవుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ, ప్రజలకు తాగు నీటిని అందించలేని ప్రభుత్వాలు ఉంటే ఎంత, పోతే ఎంత అని ఆయన విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజలందరికీ తాగు నీటిని సరఫరా చేయడాన్ని ప్రథమ ప్రాధాన్యతగా పరిగణించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేయవలసిన సమయం ఆసన్నమైందని సూచించారు. ‘ప్రతి సంవత్సరం వేసవిలో కరవు పరిస్థితులు ఎదురవుతున్నాయి. నీటి ఎద్దటి ఏర్పడుతోంది. ఇలా ఎంత కాలం కొనసాగాలి’ అని రాజమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని సూచించారు.