S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/13/2016 - 02:20

న్యూఢిల్లీ, మే 12: ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల కోలాహలానికి తెరలేచింది. తెలంగాణలో రెండు, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు స్థానాలతోపాటు మొత్తం పదిహేను రాష్ట్రాల్లో 58 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఎన్నికల షెడ్యూలు ప్రకటించింది. కొత్త సభ్యులను ఎన్నుకునేందుకు సంబంధించిన షెడ్యూలు మే 24న విడుదల చేస్తారు. నామినేషన్లను మే 31లోగా దాఖలు చేయవలసి ఉంటుంది.

05/13/2016 - 02:18

న్యూఢిల్లీ, మే 12: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు, రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు, చౌదరీ బీరేం ద్ర సింగ్, పియూష్ గోయల్, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరి, ముక్తార్ అబ్బాస్ నఖ్వితోపాటు దేశానికి తొమ్మిది వేల కోట్ల రూపాయల మేరకు కుచ్చుటోపి పెట్టిన విజయ్ మాల్యా పదవీకాలం జూన్ 21తో ముగుస్తుంది.

05/13/2016 - 04:01

న్యూఢిల్లీ, మే 12: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు కెవిపి రామచందర్‌రావుప్రతిపాదించిన ప్రైవేట్ మెంబర్ బిల్లు ఓటింగ్‌కు రాకుండా చూసేందుకే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు కుట్రచేసి రాజ్యసభను గడువుకు ముందు నిరవధికంగా వాయిదా వేయించేందుకు ప్రయత్నించారని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, కార్యదర్శి కొప్పుల రాజు, రాజ్యసభ సభ్యులు కెవిపి ర

05/12/2016 - 18:26

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా కోసం తాను రాజీలేని పోరాటం చేస్తానని కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు గురువారం ఇక్కడ మీడియాకు తెలిపారు. రాజ్యసభలో తాను ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు పార్లమెంటు వర్షాకాల సమావేశంలో ఆమోదం పొందుతుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు. ప్రత్యేక హోదా కోసం కోటి సంతకాలు సేకరించామని, తన బిల్లుకు పార్టీ రహితంగా ఎంపీలంతా మద్దతు ఇవ్వాలని కోరారు.

05/12/2016 - 17:31

దిల్లీ: రాజ్యసభలో ఖాళీ అవుతున్న ఎంపీ స్థానాలను భర్తీ చేసేందుకు షెడ్యూల్‌ను గురువారం విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 4, తెలంగాణ 2 స్థానాలకు జూన్‌ 11 ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు మే 31 తుది గడువుగా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా మరో 57 రాజ్యసభ స్థానాలకు ఈనెల 24న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

05/12/2016 - 17:30

దిల్లీ: ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ నియమితులయ్యారు. ఇప్పటికే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, క్రీడాకారులు సచిన్ టెండూల్కర్, అభినవ్ బింద్రా గుడ్‌విల్ అంబాసిడర్లుగా నియమితులయ్యారు. తాము పంపిన లేఖకు రెహమాన్ సానుకూలంగా స్పందించి గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉండేందుకు అంగీకరించినట్లు భారత ఒలింపిక్ సంఘం గురువారం ప్రకటించింది.

05/12/2016 - 12:03

దిల్లీ: మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే ‘నీట్’ నుంచి మినహాయించాలని పలు రాష్ట్రాలు కోరినందున సుప్రీం కోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. వెంటనే పిటిషన్ వేయాలని భారత అటార్నీ జనరల్‌ను ప్రధాని మోదీ ఆదేశించినట్లు తెలిసింది. తాము ఇప్పటికే ఎంసెట్ నిర్వహించినందున ఈ ఏడాదికి నీట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎపి ప్రభుత్వం డిమాండ్ చేసింది.

05/12/2016 - 12:02

దిల్లీ: తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ గురువారం ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. విభజన సమస్యలు, దుర్భిక్ష పరిస్థితులు, కేంద్ర సాయం తదితర అంశాలపై ఆయన మోదీకి వివరించారు. రెండు రాష్ట్రాల్లో నెలకొన్న కరవుపై నివేదికలను అందజేశారని సమాచారం.

05/12/2016 - 12:02

ముంబయి: ఆలయాల్లో లింగ సమానత్వం కోసం పోరాడుతున్న భూమాత బ్రిగేడ్ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్ ముంబయిలోని ప్రఖ్యాత హజీ అలీ దర్గాలోకి గురువారం ఉదయం ప్రవేశించారు. ఈ సందర్భంగా దర్గా వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే శనిశింగనాపూర్, త్య్రయంబకేశ్వరం ఆలయాల్లో ప్రవేశించిన ఆమె హాజీ అలీ దర్గాలోకి వెళతానని గతంలోనే ప్రకటించారు. అనుకున్నట్లే ఆమె దర్గాలోకి వెళ్లారు.

05/12/2016 - 12:01

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయాన్ని శీతాకాల విరామం అనంతరం గురువారం తెల్లవారు జామున 4-35 నిమిషాలకు తిరిగి తెరిచారు. ఆలయం తలుపులు తెరిచే సమయానికే భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు. ఇప్పటికే కేదారినాథ్, గంగోత్రి, యుమునోత్రి ఆలయాలను తెరిచారు. ఇపుడు బద్రీనాథ్ ఆలయం తెరుచుకోవడంతో చార్‌ధామ్ యాత్ర పూర్తిస్థాయిలో ప్రారంభమైనట్లే.

Pages