జాతీయ వార్తలు

తెలంగాణ ప్రాజెక్టులపై సుప్రీంలో పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: అనుమతుల్లేకుండా తెలంగాణలో నిర్మిస్తున్న డిండి, పాలమూరు ప్రాజెక్టుల వల్ల తమకు అన్యాయం జరుగుతుందని ఎపి రైతులు శుక్రవారం సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ ప్రాజెక్టులను నిలిపివేయాలని రైతుల తరఫున హాజరైన న్యాయవాది వాదించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరైనట్లు తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది వివరించారు. అనుమతుల్లేకుండా ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తారని ద్విసభ్య ధర్మాసనం ప్రశ్నించగా, కౌంటర్ దాఖలు చేసేందుకు వ్యవధి కావాలంటూ తెలంగాణ తరఫున న్యాయవాది కోరారు. కౌంటర్ దాఖలు చేసేందుకు జూలై 20 వరకూ వ్యవధి ఇస్తూ విచారణను అదే రోజు జరుపుతామని ధర్మాసనం తెలిపింది. అదనపు అఫిటవిట్ దాఖలు చేసేందుకు ఎపి రైతులకు కోర్టు అనుమతి మంజూరు చేసింది.