జాతీయ వార్తలు

హరీష్ రావత్‌కు సిబిఐ సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: పదవీచ్యుతుడైన ఉత్తరాఖండ్ సిఎం హరీష్ రావత్‌కు కొత్తకష్టాలు ప్రారంభమయ్యాయి. ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలనను నైనిటాల్ హైకోర్టు రద్దు చేసినా ఆ ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో బలపరీక్ష కోసం నిరీక్షిస్తున్న రావత్‌కు ఇపుడు సిబిఐ సమన్లు పంపింది. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు రావత్ డబ్బుల్ని ఎరవేశారంటూ ‘స్ట్రింగ్ ఆపరేషన్’లో ఓ వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోపై నిజానిజాలు తెలియజేసేందుకు సోమవారం తమ వద్దకు హాజరు కావాలని సిబిఐ సమన్లు జారీ చేసింది. తాను ఎవరినీ ప్రలోభపెట్టలేదని, ఆ వీడియో నిజం కాదని రావత్ వాదిస్తున్నారు.