జాతీయ వార్తలు

గోవా ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ: ఓ మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోవా మాజీ విద్యాశాఖ మంత్రి, బహిష్కృత కాంగ్రెస్ ఎమ్మెల్యే అటాసినో మోన్సరేట్‌పై స్థానిక పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసి క్రైమ్ బ్రాంచికి విచారణ బాధ్యతలు అప్పగించారు. ఆ ఎమ్మెల్యే తన దుకాణంలో పని ఇస్తానని చెప్పి పలుసార్లు అత్యాచారం చేసినట్లు బాలిక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మరొకరికి విక్రయించేందుకు కూడా ఆయన ప్రయత్నించినట్లు ఆమె ఆరోపించడంతో మానవ అక్రమరవాణా కింద కూడా ఎమ్మెల్యేపై కేసు పెట్టారు. కాగా, ఆ బాలిక తల్లిదండ్రులు తన వద్దకు వచ్చి అర్థించడంతో ఆమెకు ఉద్యోగం ఇచ్చానని, క్యాష్‌కౌంటర్‌లో నగదు చోరీ చేయడంతో బాలికను ఉద్యోగంలో నుంచి తొలగించినట్లు ఎమ్మెల్యే చెబుతున్నారు. ఉద్యోగం పోయిందన్న అక్కసుతో తనపై ఆ బాలిక తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు.