జాతీయ వార్తలు

కొలిక్కిరాని ‘విధానపత్రం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 8: ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాలు, పదోన్నతులకు సంబంధించి సవరించిన విధాన పత్రం (మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్)లోని రెండు నిబంధనల పట్ల సుప్రీంకోర్టు కొలీజియం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇందులోని ఒక నిబంధన ప్రకారం జాతీయ ప్రయోజనాల రీత్యా సుప్రీంకోర్టు కొలీజియం చేసిన ఏ సిఫార్సునయినా తిరస్కరించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అయతే ప్రస్తుతం అమల్లో వున్న విధానానికి ఈ నిబంధన పూర్తి విరుద్ధంగా ఉంది. ప్రస్తుత విధానం ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో నలుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం చేసే సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం ఒకసారి తిరస్కరించినా, కొలీజియం తిరిగి సిఫార్సు చేస్తే అప్పుడు తప్పనిసరిగా ఆమోదించవలసి ఉంటుంది. ఈ నిబంధనను కేంద్రం సవరించింది. దీని ప్రకారం దేశ ప్రయోజనాల రీత్యా కొలీజియం సిఫార్సును కేంద్ర ప్రభుత్వం తిరస్కరించవచ్చు. కేంద్రం ఒకసారి తిరస్కరించిన సిఫార్సును కొలీజియం తిరిగి పంపించినా ప్రభుత్వం దానిని ఆమోదించవలసిన అవసరం లేదు. మరో నిబంధన ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకం, పదోన్నతులకు కొలీజియం చేసే సిఫార్సులలో కేంద్ర స్థాయిలో అటార్నీ జనరల్, రాష్ట్ర స్థాయిలో అడ్వకేట్ జనరల్‌కు అధికారం ఉంటుంది. ఈ నిబంధన వల్ల సుప్రీంకోర్టు, హైకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి ఎంపిక చేసే పేర్ల విషయంలో పరోక్షంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంటుంది.
కొలీజియం వ్యవస్థను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దడం కోసం విధాన పత్రాన్ని తిరిగి రాయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రభుత్వానికి సూచించిన తరువాత కేంద్రం కొన్ని సవరణలు చేస్తూ తిరిగి విధాన పత్రాన్ని రూపొందించింది. కేంద్ర న్యాయ మంత్రి డి.వి.సదానంద గౌడ మార్చిలో ఈ సవరించిన విధానపత్రాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్‌కు పంపించారు. ఈ విధానపత్రం ముసాయిదా ఇంకా సుప్రీంకోర్టు కొలీజియం వద్దనే ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే కొలీజియం ఈ పత్రంలోని కొన్ని నిబంధనల పట్ల తన అభ్యంతరాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసినట్లు ఆ వర్గాలు చెప్పాయి.