జాతీయ వార్తలు

ఉత్తరాఖండ్‌లో ‘బలపరీక్ష’ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైనిటాల్: పదవీచ్యుతుడైన ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఉత్తరాఖండ్ శాసనసభలో బలపరీక్షను ఎదుర్కొంటున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 11 గంటలకు బలపరీక్ష మొదలైంది. ఈ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది. రెండు గంటల సేపు రాష్టప్రతి పాలనను సడలించి బలపరీక్షను అధికారులు నిర్వహిస్తున్నారు. చివరి నిమిషంలోనూ రాజకీయ వేదికపై అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటన్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే రేఖా ఆర్య బిజెపి శిబిరంలో చేరగా, బిజెపి నుంచి భీమ్‌లాల్ ఆర్య కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. హరీష్ రావత్‌కు తమ ఎమ్మెల్యేలు అండగా ఉంటారని బిఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. 71 మంది సభ్యులున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రస్తుతం తనకు 34 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, బలపరీక్షలో విజయం తనదేనని హరీష్ రావత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బలపరీక్షలో నెగ్గాలంటే 32 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా, 34 మంది తనకు అనుకూలంగా ఓటు వేస్తారని రావత్ అంటున్నారు. 9 మంది బహిష్కృత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బలపరీక్షలో పాల్గొనేందుకు అనర్హులని సుప్రీం తీర్పు చెప్పడంతో హరీష్ రావత్ బలపరీక్షలో నెగ్గే అవకాశం ఉంది. బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీ భవనం పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించి పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.