జాతీయ వార్తలు

పార్లమెంట్ అధికారాలు కాపాడుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 13: పార్లమెంటు హక్కులను, అధికారాలను న్యాయ వ్యవస్థ ఆక్రమిస్తోందంటూ శుక్రవారం రాజ్యసభలో సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పదవీవిరమణ పొందిన 53 మంది సభ్యులకు వీడ్కోలు పలికేందుకు శుక్రవారం సమావేశమైన రాజ్యసభలో సభా నాయకుడు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ చట్టాలు, బడ్జెట్లను తయారు చేయడంలో పార్లమెంటు ఆధిపత్యాన్ని పరిరక్షించుకోవలసిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
‘ఈ సభ (రాజ్యసభ)కు, లోక్‌సభకు చట్టాలను రూపొందించే, బడ్జెట్‌లను తయారుచేసే సర్వోత్కృష్ట అధికారం ఉంది’ అని జైట్లీ న్యాయ వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని అన్నారు. చట్టాలను, బడ్జెట్‌లను రూపొందించే అధికారం ఇక్కడి నుంచి వెళ్లిపోతే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంతో పాటు మొత్తం ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని జైట్లీ హెచ్చరించారు. సమాజంలోని అన్ని వర్గాలు ఈ అంశం గంభీరతను, ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అన్నారు. న్యాయ వ్యవస్థ ఒక్కో అడుగు వేసుకుంటూ ఒక్కో ఇటుక పేర్చుకుంటూ శాసన వ్యవస్థ అధికారాల పరిధిని ఆక్రమిస్తోందంటూ రెండు రోజుల క్రితం జైట్లీ రాజ్యసభలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. కరవు ప్రాంతాల్లో ప్రజలను ఆదుకోవడానికి ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్‌తో పాటు అదనపు నిధులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. జైట్లీ అభిప్రాయంతో ఇతర సభ్యులు కూడా ఏకీభవించారు. శాసన వ్యవస్థ హక్కులను న్యాయ వ్యవస్థ ఆక్రమించడం పట్ల పార్లమెంటు సభ్యులు ఆందోళనతో ఉన్నారని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ అన్నారు. రాజ్యాంగం చట్టాలను, బడ్జెట్‌లను రూపొందించే అధికారాన్ని పార్లమెంటుకు ఇచ్చిందని పేర్కొంటూ, న్యాయ వ్యవస్థే ఆ పని చేస్తే ఇక పార్లమెంటు ఆవశ్యకత ఏముంటుందని? ఆయన ఆశ్యర్యం వ్యక్తం చేశారు.
19 గంటల వృథా..
ఏప్రిల్ 25న ప్రారంభమై, శుక్రవారం నిరవధికంగా వాయిదా పడిన రాజ్యసభ ఈ దఫా 12 బిల్లులను ఆమోదించింది. అయితే ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధింపు, వివాదాస్పద అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం వంటి అంశాలపై జరిగిన రభసతో రాజ్యసభ 19 గంటల సమయాన్ని వృథాగా కోల్పోయింది.

గయ ఎమ్మెల్సీ ఇల్లు జప్తు

గయ, మే 13: బిహార్ జెడియు ఎమ్మెల్సీ మనోరమ దేవి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. తన కారును ఓవర్‌టేక్ చేశాడన్న ఆగ్రహంలో ఒక యువకుడిని ఎమ్మెల్సీ కుమారుడు రాకీ యాదవ్ కాల్చిచంపిన సంగతి తెలిసిందే. రాకేష్ యాదవ్ అలియాస్ రాకీ యాదవ్ అరెస్టు తరువాత ఆమె తల్లి మనోరమ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఆమెను జెడియు పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది. రాకీ కోసం ఆమె నివాసంలో పోలీసులు సోదాలు చేస్తుండగా విదేశీ మద్యం బాటి ళ్లు దొరికాయి. ఎమ్మెల్సీ భర్త బిందీ యాదవ్, రాకీ యాదవ్‌లు ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తున్నారు. మనోరమ పేరు పోలీసు ఎఫ్‌ఐఆర్‌లో ఉండంతో గాలింపుసాగుతోంది. కోర్టు ఆమెపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. ముందస్తు బెయిల్ కోసం ఎమ్మెల్సీ దాఖలు చేసిన పిటిషన్‌ను జిల్లా జడ్జి ఎస్‌ఎన్ సింగ్ సోమవారం విచారణకు చేపట్టనున్నారు. ఈలోగా ఎమ్మెల్సీ ఆస్తుల జప్తునకు పోలీసులకు కోర్టు అనుమతి ఇచ్చింది. అత్యంత విలాసవంతమైన అనుగ్రహ్ పూరి కాలనీలోని మనోరమ ఇంటికి శుక్రవారం పోలీసులు జప్తు నోటీసులు అంటించారు. అదనపుచీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ ఎస్‌కె ఝా జప్పుకు ఆదేశించారు. అలాగే ఎక్సయిజ్ పోలీసులు ఎమ్మెల్సీ ఇంటిని ఇంతకు ముందే సీజ్ చేశారు.