జాతీయ వార్తలు

మోదీ సంభాషణను ఇటలీ బయటపెట్టొచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 13: భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ దేశ ప్రధానమంత్రి మటెయో రెంజితో జరిపిన ప్రైవేటు సంభాషణను ఇటలీ బహిర్గతం చేసే అవకాశం ఉందని అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల ఒప్పందంలో మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ మిచెల్ తెలిపారు. ఇద్దరు మత్స్యకారులను హత్యచేసిన కేసులో తన నిర్బంధంలో ఉన్న ఇటలీ నావికుడు సాల్వటోర్ గిరోనేను భారత్ విడుదల చేయకుంటే ఇటలీ ఇద్దరు ప్రధానుల మధ్య జరిగిన ప్రైవేటు సంభాషణను బహిర్గతం చేస్తుందని మిచెల్ ఎన్‌డిటివి న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఐక్యరాజ్య సమితి సమావేశాల సందర్భంగా ఇటలీ ప్రధానితో విడిగా భేటీ అయిన మోదీ.. అగాస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల ఒప్పందంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కోరినట్లు ఆరోపణలు వచ్చాయి. భారత్ గిరోనేను విడిచిపెట్టకుంటే ఇటలీ ప్రభుత్వం భారత్‌కు చికాకు, అసంతృప్తి కలిగించే చర్యకు పాల్పడుతుందని, ఇద్దరు ప్రధానమంత్రుల మధ్య ప్రైవేటు సమావేశం జరిగిందని అంగీకరించడమే ఆ చర్య అని మిచెల్ చెప్పారు. అయితే, ఇద్దరు ప్రధానమంత్రుల ప్రైవేటు సమావేశం జరిగిందన్న వాదనను ఇరు దేశాలు ఇప్పటి వరకు ఖండిస్తూ వచ్చాయి. అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో సోనియా గాంధీకి సంబంధించిన సమాచారాన్ని తమకు ఇస్తే.. హత్య కేసును ఎదుర్కొంటున్న ఇద్దరు ఇటలీ నావికులకు ఆ కేసు నుంచి విముక్తి కలిగిస్తామని మోదీ ఈ సమావేశంలో ఇటలీ ప్రధాని ముందు ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరు ప్రధానుల మధ్య సమావేశం జరిగిందని, అయితే అది లాంఛనప్రాయమైన సమావేశం కాదని మిచెల్ ఎన్‌డిటివి న్యూస్ చానల్‌కు చెప్పారు.

వ్యక్తిగతంగా హాజరుకండి
21మంది ఆప్ ఎమ్మెల్యేలకు
ఎన్నికల సంఘం నోటీసులు

న్యూఢిల్లీ, మే 13: పార్లమెంటరీ సెక్రెటరీలుగా నియమితులయిన 21మంది ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను తన ముందు హాజరు కావలసిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. పార్లమెంటరీ సెక్రెటరీలుగా నియమితులయిన కారణంగా వీరంతా తమ అసెంబ్లీ సభ్యత్వాలకు అనర్హులయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందని ఎన్నికల కమిషన్ వర్గాలు శుక్రవారం తెలిపాయి. ‘మా వైఖరిని చెప్పడానికి ఎన్నికల కమిషన్ ముందు వ్యక్తిగతంగా హాజరు కావలసిందిగా ఆదేశాలు అందాయి. అయితే అందులో ఏ తేదీన హాజరు కావాలనేది వెల్లడించలేదు’ అని కస్తూర్బా నగర్ ఎమ్మెల్యే మదన్‌లాల్ తెలిపారు. తమకు అందిన నోటీసులకు ఇచ్చిన సమాధానంలో ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసికెళ్లారని ఆయన చెప్పారు. పార్లమెంటరీ సెక్రెటరీ పోస్టులను లబ్ధి చేకూర్చే పదవులుగా ఎందుకు పరిగణించకూడదో తెలిపాలని ఆదేశిస్తూ ఎన్నికల కమిషన్ గతంలో 21 మంది ఆప్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వారి అసెంబ్లీ సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని కూడా ఇసి తన నోటీసుల్లో పేర్కొంది. పార్లమెంటరీ సెక్రెటరీ పోస్టుకు ఎలాంటి రెమ్యునరేషన్ కాని అధికారం కాని లేదని ఎమ్మెల్యేలు ఇసికి ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు.

కరవు నిధులు
ఖర్చుచేయలేదు

తెలంగాణ సర్కార్‌పై
దత్తాత్రేయ ధ్వజం

న్యూఢిల్లీ, మే 13: కరవునివారణ ఇచ్చిన నిధులను తెలంగాణ ప్రభు త్వం పూర్తిగా ఖర్చచేయలేదని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఆరోపించారు. దత్తాత్రేయ శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ కేంద్రం ఏ పద్దులో ఇచ్చిన నిధులను ఆ పద్దులోనే ఖర్చు చేయాలని వేరే పథకాలకు మళ్లించకూడదని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో కరవుశాశ్వత నివారణ చర్యల కూడా కేంద్రం చేయూతనిస్తోందని ఆయ న తెలిపారు. కేంద్రం పిఎంకెవై పథకం కింద ప్రాణహిత, పెన్‌గంగ, తుమ్మిడిహట్టి ప్రాజెక్టులను చేర్చుతామన్నారు. వెట్టిచాకిరీ నుంచి విముక్తి కలిగించేందుకు రాష్ట్రాల వాటా లేకుండా కొత్త పథకాన్ని తీసుకురానున్నట్టు బండారు చెప్పారు.
స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు దాటినా వెట్టిచాకిరీ కొనసాగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులందరికీ పిఎఫ్ ఖాతాలకు యూనివర్సల్ అకౌంట్ నెంబర్లు ఇస్తామన్నారు.

ప్రతీ గ్రామం
విత్తన ఉత్పత్తి కేంద్రం
తెలంగాణ మంత్రి పోచారం వెల్లడి

హైదరాబాద్, మే 13: ప్రతీ గ్రామాన్ని విత్తన ఉత్పత్తి కేంద్రంగా మార్చబోతున్నామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా మార్చడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. సచివాలయంలో శుక్రవారం జర్మనీకి చెందిన వ్యవసాయ శాస్తవ్రేత్తల బృందంతో మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో విత్తన ఉత్పత్తికి ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయడానికి జర్మనీ బృందం రాష్ట్రానికి వచ్చిందన్నారు. విత్తన ఉత్పత్తిలో ఆధునీక పరిజ్ఞానం, నూతన పద్ధతులను రైతులు అనుసరించాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే 400 విత్తన కంపెనీలు 2 లక్షల ఎకరాలలో వీటిని సాగు చేయడంతో పాటు లక్ష 50 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయన్నారు. ప్రతి గ్రామంలో విత్తన గ్రా మం కార్యక్రమాన్ని చేపట్టినట్టు మంత్రి తెలిపారు. నాలుగు రోజుల పాటు జర్మనీ బృందం రాష్ట్రంలో పర్యటించి రాష్ట్రంలో విత్తన ఉత్పతికి ఉన్న అవకాశాలను, సాంకేతిక సలహాలను అందజేయనున్నారని తెలిపారు. ఈ బృందం శనివారం నల్లగొండ జిల్లాలో పర్యటించనుందని మంత్రి వెల్లడించారు.