జాతీయ వార్తలు

అమ్మ సేవలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. భారత దేశ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణం చేసి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఆయన తల్లి హీరాబెన్
మొట్టమొదటిసారి రేస్‌కోర్స్ రోడ్‌లోని తనయుని అధికార నివాసానికి వచ్చారు. కొడుకుగా మోదీ ఆమెకు అన్ని సపర్యలు చేశారు. చక్రాల కుర్చీలో తల్లిని
కూర్చోబెట్టుకుని తన నివాస ప్రాంగణంలోని తోటలో సరదాగా తిప్పుతూ..
ఒక్కో మొక్క గురించి తల్లికి వివరించారు. తన తల్లితో తాను చాలా సేపు గడపడం ఎంతో ఆనందంగా ఉందని.. ఆమె తిరిగి గుజరాత్‌కు సంతోషంగా వెళ్లారని మోదీ ఆదివారం ట్వీట్ చేశారు. హీరాబెన్ గుజరాత్‌లోని మెహసానా
జిల్లాలోని వాద్‌నగర్‌లో పూర్వీకుల ఇంట్లో ఉంటున్నారు.