జాతీయ వార్తలు

సోనియాను కీలక శక్తిగా పేర్కొన్న మాట నిజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 12: కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో అగస్టా వెస్ట్‌లాండ్ కొనుగోళ్లకు సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కీలక శక్తిగా తాను అభివర్ణించిన మాట నిజమేనని ఈ వివాదాస్పద ఒప్పందంలో మధ్యవర్తి క్రిస్టియన్ జేమ్స్ అంగీకరించారు.
అయితే తనకు వ్యక్తిగతంగా సోనియా,ఆమె కుమారుడు రాహుల్ తెలియరని ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలాగే సోనియాను గానీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ను గానీ తానెప్పుడూ కలుసుకోలేదన్నారు. 2008లో తాను రాసిన లేఖలో వీరిద్దరిని దౌత్యవేత్తలు లాబీయింగ్ చేశారని చెప్పినంత మాత్రాన వీరికే ముడుపులు చెల్లించారని అర్థం కాదన్నారు. తనను తాను రక్షించుకోవాలంటే వీరిద్దరినీ రక్షించాలని, తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాలంటే వీరిద్దరికి ఎలాంటి ప్రమేయం లేదని రుజువు చేయాల్సి ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా జేమ్స్ తెలిపారు.
అగస్టా వెస్ట్‌లాండ్ ఒప్పందానికి సంబంధించిన వివరాలు ఇస్తే ఇద్దరు మెరైన్లను విడుదల చేస్తామని న్యూయార్క్‌లో ఇటలీ ప్రధానిని కలుసుకున్న సందర్భంగా భారత ప్రధాని హామీ ఇచ్చారంటూ చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని తెలిపారు.