జాతీయ వార్తలు

నర్సింగ్ రంగంలో సామర్థ్యం పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 12: ప్రపంచవ్యాప్తంగా కొత్త కొత్త అంటువ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు, ప్రకృతి వైపరీత్యాలు వైద్య సేవలపై మరింత ఒత్తిడి పెంచుతున్న దృష్ట్యా నర్సింగ్ రంగంలో సామర్థ్యం పెంపునకు కొత్త కొత్త మార్గాలను అనే్వషించాల్సిన అవసరం ఉందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. వైద్య సేవల రంగానికి నర్సులు వెనె్నముక వంటి వారని రాష్టప్రతి అంటూ, పోలియో నిర్మూలన, మంత్రసాని సేవలు, సామాజిక చైతన్యం కల్పించడం లాంటి జాతీయ స్థాయి ప్రచారోద్యమాలతో పాటుగా వైద్య సేవలకు సంబంధించిన అన్ని రంగాల్లోను నర్సులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలతో పాటుగా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలన్నిటిలో కూడా నర్సుల అంకిత భావం, రోగుల పట్ల వారు చూపించే శ్రద్ధను అందరూ ప్రశంసిస్తూ ఉంటారని, వైద్య సేవల రంగంలో జాతీయ లక్ష్యాలను సాధించడంలోను వారి పాత్ర ఎంతో ముఖ్యమైందని రాష్టప్రతి అన్నారు. కొత్త కొత్త అంటువ్యాధులు, రోగాలు, ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచానికి కొత్త ముప్పులుగా తయారవుతున్నాయని, అవి వైద్య సేవా రంగంపై మరింత ఒత్తిడి తెస్తున్నాయని ఆయన అంటూ, ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే వ్యవస్థకుకు నర్సుల సేవలు ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు. ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా గురువారం ఉత్తమ సేవలందించిన నర్సులకు ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను ప్రదానం చేసిన సందర్భంగా రాష్టప్రతి మాట్లాడారు. భారతీయ నర్సుల పాత్రను ప్రపంచవ్యాప్తంగా అందరూ ప్రశంసిస్తూ ఉన్నారని రాష్టప్రతి అంటూ, రాబోయే 15 ఏళ్లలో నర్సుల సేవల తీరులో గణనీయమైన మార్పు రానుందని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ రంగంలో శిక్షణ, సామర్థ్యం పెంపుకొత్త పుంతలు తొక్కాల్సిన అవసరం ఎంతయినా ఉందని ప్రణబ్ అన్నారు.

చిత్రం జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా విజేతలైన నర్సులతో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ