జాతీయ వార్తలు

ఇందిరకు మేనక ఎందుకు దూరమయ్యారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 12: మొదట్నుంచీ సోనియాపైనే ఆమె అత్త ఇందిర మక్కువ చూపేవారా? ఒక దశలో చిన్న కోడలు మేనకను చేరదీసినప్పటికీ ఆమెను అనివార్యంగా ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇందిరాగాంధీకి వ్యక్తిగత వైద్యుడిగా వ్యవహరించిన డాక్టర్ కేపీ మాథుర్ తన తాజా పుస్తకం ‘అన్‌సీన్ ఇందిరాగాంధీ’లో మాజీ ప్రధాని గురించి అనేక వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఈ పుస్తకంలో మాథుర్ ప్రస్తావించిన విషయాల మేరకు సంజయ్‌గాంధీ తరువాత రాజకీయాలపై బాగా అవగాహన ఉన్న వ్యక్తిగా మేనకను భావించిన ఇందిరాగాంధీ ఆ తరువాత ఆమెను తప్పనిసరిగా పక్కన పెట్టాల్సివచ్చింది. తనకు వారసుడిగా ఎదిగిన సంజయ్‌గాంధీ అనూహ్యంగా విమాన ప్రమాదంలో మరణించటంతో ఆయన స్థానంలో తనకు రాజకీయాల్లో సహాయకారిగా మేనకను వినియోగించాలని ఇందిర భావించారు. కానీ, తన పెద్ద కుమారుడు రాజీవ్‌గాంధీ వ్యతిరేకులతో మేనకాగాంధీ అనుకూలంగా వ్యవహరించటం వల్ల ఒకటి రెండేళ్లలోనే ఆమె అత్తగారిల్లు వదిలి వెళ్లాల్సివచ్చింది. మొదట్నుంచీ ఇంటి వ్యవహారాల్లో పైచేయిగా వ్యవహరిస్తున్న సోనియా వైపే ఇందిర మొగ్గు చూపారు. సోనియాగాంధీ ఇంటి వ్యవహారాల్లో పూర్తిగా ఆధిపత్యం చెలాయించటంతో మేనకాగాంధీకి ఇందిర వారసురాలిగా ఎదిగే అవకాశం పోయింది. ‘ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో సోనియాగాంధీదే పైచేయిగా ఉండేది. మేనక అభిప్రాయాలు ఆమె లోని రాజకీయ అవగాహనను ఇందిర అర్థం చేసుకున్నారు. సంజయ్ చనిపోయిన తరువాత మేనక పట్ల ఆమెకు(ఇందిర) సానుభూతిగానే ఉండేది. రాజకీయాల్లో మేనక సహాయాన్ని కూడా ఆమె కోరుకున్నారు. కానీ, రాజీవ్ వ్యతిరేక వర్గంతో సన్నిహితంగా మేనక మెలగటం వల్ల ఆమె ఇందిరకు దూరం కావలసి వచ్చింది.’ అని మాథుర్ తన పుస్తకంలో పేర్కొన్నారు. సంజయ్‌గాంధీ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలన్న లక్ష్యంతోనే సంజయ్ విచార్‌మంచ్ ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఆమె పుస్తకాలు ఎక్కువగా చదివే వారని ముఖ్యంగా ఆత్మకథలు, సైన్స్ గ్రంథాలను మక్కువగా చదివేవారని మాథుర్ వెల్లడించారు. మధ్యాహ్నభోజనం తరువాత ఇందిరాగాంధీ కార్డ్స్ కూడా ఆడేవారట. కార్డ్స్‌లో కలీమామ్ అనే ఆట ఆమెకు చాలా ఇష్టమని మాథుర్ వివరించారు. ఇందిరాగాంధీ చాలా ధైర్యవంతురాలైన మహిళ అని ఆయన పేర్కొన్నారు. హిందీ వ్యతిరేక ఉద్యమం తీవ్రస్థాయిలో కొనసాగుతున్న సమయంలో మద్రాస్ యూనివర్సిటీకి వెళ్లిన ఇందిర అక్కడి విద్యార్థులతో ‘మీరు డౌన్‌డౌన్ అని హిందీలో అనవద్దు.. తమిళంలో అనండి.. తద్వారా నేను తమిళం నేర్చుకుంటాను..మీరు హిందీ నేర్చుకొండి అని అన్నారు’ అని మాథుర్ వివరించారు.

* ‘‘సాధారణంగా ఇంటి వ్యవహారాల్లో సోనియాది పై చేయిగా ఉండేది. మేనక విషయానికి వస్తే ఆమె అభిప్రాయాలు ఆమెలో రాజకీయ అవగాహన బాగా ఉందని ఇందిరాగాంధీ భావించారు’’
* ‘‘మేనకాగాంధీ మొదట్నుంచీ రాజీవ్‌గాంధీ వ్యతిరేకులతో అనుకూలంగా ఉండేవారు. సంజయ్ విచార్‌మంచ్ ఏర్పాటుకు అదే కారణమైంది.’’