S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/23/2016 - 01:00

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 22: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టే పిఎస్‌ఎల్‌వి-సి 35 రాకెట్ ప్రయోగానికి సంబంధించిన గురువారం చేపట్టిన రిహార్సల్స్ విజయవంతం అయింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని షార్‌కేంద్రం నుంచి ఈ నెల 26న ప్రయోగించే ఈ రాకెట్‌కు సంబంధించిన ప్రయోగాత్మక ప్రయోగాన్ని (రిహార్సల్) గురువారం షార్‌లో శాస్తవ్రేత్తలు విజయవంతంగా నిర్వహించారు.

09/23/2016 - 00:57

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 22: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా కోసం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి ఎఐసిసినుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో రాహుల్ గాంధీ చేపట్టిన కిసాన్‌యాత్రకు ఏపి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం సంఘీభావం తెలిపింది.

09/23/2016 - 00:54

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: వెనుకబడిన ప్రాంతం అయిన అరకుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీనీ కోరినట్లు ఎంపీ కొత్తపల్లి గీత తెలిపారు.గురువారం ప్రధానిని కలిసిన అనంతరం గీత విలేఖరులతో మాట్లాడారు. ప్రధాని గ్రామీణ సడక్ యోజన కింద నిధులివ్వాలని కోరామన్నారు.

09/23/2016 - 00:50

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: సంవత్సరానికి కోటిన్నర రూపాయిల టర్నోవర్ ఉన్న పరిశ్రమలు, సంస్థలన్నింటిపైనా రాష్ట్రాలకే నియంత్రణ ఉండాలని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ కేంద్రానికి స్పష్టం చేశారు. గురువారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ఈటల రాజేందర్ హాజరైయ్యారు.

09/23/2016 - 00:49

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: జీఎస్టీ రేటు పరిధిని 18 శాతం నుంచి 20 శాతం ఉండేలా చూడాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసింది. గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్వర్యంలో జరిగిన జీఎస్టీ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు హాజరైయ్యారు. ఈ సమావేశంలో మూఖ్యంగా జీఎస్టీ రేటులో మినహాయింపులు ఇతర అంశాలపై చర్చ జరిగినట్టు ఆయన తెలిపారు.

09/23/2016 - 00:35

ముంబయి, సెప్టెంబర్ 22: ఉరీ ఘటన మరువకముందే ముంబయి తీరంలో మరో అలజడి చోటుచేసుకుంది. సైనిక దుస్తులు ధరించిన నలుగురు వ్యక్తులు ఉరాన్‌లో అనుమానాస్పదంగా సంచరిస్తున్నారన్న సమాచారం అందడంతో అటు కోస్ట్‌గార్డ్, ఇటు మహారాష్ట్ర పోలీసులు జల్లెడ పడుతున్నారు. ముంబయికి 47 కి.మీ దూరంలోని ఉరాన్, కరంజా ప్రాంతంలో సైనిక దుస్తులు ధరించిన వ్యక్తులు సంచరించడాన్ని నలుగురు పాఠశాల విద్యార్థులు గుర్తించి సమాచారం అందించారు.

09/23/2016 - 00:30

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: ఉరీ సెక్టార్‌పై దాడి నేపథ్యంలో భారత్ యుద్ధానికి దిగవచ్చునేమోనని పాకిస్తాన్‌లో భయం మొదలైంది. వాయుమార్గాల్లో కొన్నింటిని, రెండు రోడ్డు మార్గాలను మూసేశారు. పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు ప్రారంభించారు.

09/23/2016 - 00:29

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: బ్రిటన్‌లో భారత హైకమిషనర్‌గా పనిచేస్తున్న నవ్‌తేజ్ సర్నాను అమెరికా రాయబారిగా నియమితులయ్యారు. నవ్‌తేజ్ 1980 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారి. ఈ ఏడాది జనవరిలోనే లండన్‌లో హైకమిషనర్‌గా నియమించబడ్డారు. అంతకుముందు విదేశాంగ శాఖలో కార్యదర్శిగా పనిచేశారు.

09/23/2016 - 00:26

ఉరీ, సెప్టెంబర్ 22: ఉరీ సెక్టార్‌లో భారీ భద్రతతో ఉండే సైనిక శిబిరంపై ఉగ్రవాదుల దాడికి సెక్యూరిటీ గార్డు పోస్టుల మధ్య సమన్వయ లోపమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. జాతీయ భద్రతా ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఈ కేసు విచారణలో ఇప్పటికే డాక్యుమెంటేషన్ పనిని పూర్తి చేసింది. దాడి జరిగిన ప్రాంతం నుంచి ఆధారాలను సేకరించింది. ఉరీ సైనిక శిబిరానికి చాలా చోట్ల కంచె సరిగా లేదని అధికార వర్గాలు తెలిపాయి.

09/23/2016 - 00:22

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ఆస్పత్రుల్లో అధికారులు రోగులపట్ల నిర్దయగా ప్రవర్తించడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మీర్జాపూర్ ఆస్పత్రిలో 70 ఏళ్ల వృద్ధుడు అనారోగ్యంతో బాధపడుతున్న తన కోడలిని భుజాలపై మోసుకుపోవలసిన పరిస్థితిపై మీడియాలో కథనాలు రావడంతో ఎన్‌హెచ్‌ఆర్‌సి ఆ కథనాలపై తీవ్రంగా స్పందించింది.

Pages