జాతీయ వార్తలు

భయపడుతున్న పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: ఉరీ సెక్టార్‌పై దాడి నేపథ్యంలో భారత్ యుద్ధానికి దిగవచ్చునేమోనని పాకిస్తాన్‌లో భయం మొదలైంది. వాయుమార్గాల్లో కొన్నింటిని, రెండు రోడ్డు మార్గాలను మూసేశారు. పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు ప్రారంభించారు. ఈ సైనిక విన్యాసాలు ఉరీ దాడి నేపథ్యంలోనో, భారత్ యుద్ధానికి దిగుతుందన్న వదంతులతోనో చేస్తున్నవి కాదని, ఇవి చాలా రోజుల ముందుగానే ప్లాన్ చేసినవని పాక్ అధికారులు చెప్తున్నప్పటికీ, వాస్తవానికి భారత్ అటు అంతర్జాతీయ వేదికలపైనా, ఇటు స్వదేశంలోనూ స్పందించిన తీరుతోనేనని సమాచారం. ఉత్తర పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో వైమానిక విన్యాసాలు జరుగుతున్నాయి. ఉరీ దాడి తరువాత రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ‘్భరత్ నుంచి ప్రమాదం పొంచి ఉన్న దృష్ట్యా నిఘాను అత్యంత తీవ్రతరం చేశారు’ అని డాన్ పత్రిక పేర్కొంది. పాకిస్తాన్‌లోని కొన్ని పత్రికలు, చానళ్లు భారత్ యుద్ధానికి సిద్ధమవుతోందని వార్తలు ప్రసారం చేయటంతో ఈ ఉద్రిక్తత పెరిగిపోయింది. అయితే పాక్ సైనిక ఉన్నతాధికారులు ఇదంతా సాధారణంగా జరిగేదేనని కొట్టిపారేశారు.