S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/22/2016 - 17:10

హైదరాబాద్‌: ‘ ఇక పాటలు చాలనుకుంటున్నా.. విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నా..’ - అని మధుర గాయని ఎస్‌. జానకి ప్రకటించారు. వేడుకల్లో సైతం ఇక పాడబోనని ఆమె ఓ ఆంగ్లపత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ.. ఇలా వివిధ భాషల్లో దాదాపు 48,000 పాటలను ఆలపించిన జానకి- 59 సంవత్సరాల తన సుదీర్ఘ కెరీర్‌కు మలయాళ పాటతో ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు.

09/22/2016 - 16:49

జైసల్మేర్‌ (రాజస్థాన్‌) : రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ బడా బాగ్‌ వద్ద భారత వైమానిక దళానికి చెందిన ఓ మానవ రహిత విమానం (యూఏవీ) గురువారం కూలినట్లు రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్‌ కల్నల్‌ మనీశ్‌ ఓజా వెల్లడించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఓజా తెలిపారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. రిమోట్‌ కంట్రోల్‌ లేదా ఆటోమేటిక్‌ టెక్నాలజీ సాయంతో యూఏవీలు పనిచేస్తాయి.

09/22/2016 - 16:33

ముంబయి: కొందరు అనుమానిత వ్యక్తులు ఆయుధాలతో సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో నౌకాదళ అధికారులు ముంబయిలో గురువారం హైఅలర్ట్‌ ప్రకటించారు. ఉరాన్‌ ప్రాంతంలోని నౌకాదళ స్థావరం వద్ద అనుమానితులు ఆయుధాలతో తిరుగుతూ సంచరించినట్లు పాఠశాల విద్యార్థులు అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించి తనిఖీలు చేపట్టారు.

09/22/2016 - 14:03

దిల్లీ: ఆప్‌ ఎమ్మెల్యే సోమనాథ్‌ భారతిని దిల్లీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. దిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రి ఆవరణలో భద్రతా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంతో పాటు వారిపై దాడికి దిగినందుకు ఆయనపై కేసు నమోదైంది. ఈ నెల 6వ తేదీన ఎయిమ్స్‌ ప్రాంగణంలోని వస్తువులను సోమనాథ్‌, ఆయన కార్యకర్తలు ధ్వంసం చేయడంతో పాటు వారిపై దాడికి దిగారు.

09/22/2016 - 12:27

ముంబయి: ముంబయి నగరం గురువారం నీట మునిగే ప్రమాదం ఏర్పడింది. తెల్లవారుజామునే నగరం అంతా భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల మోకాలి లోతు నిలిచాయి. భారీ వర్షం కారణంగా కార్యాలయాలకు వెళ్లేవారు నానా తంటాలు పడ్డారు. రాగల 48 గంటల్లో ముంబయి సహా తీర ప్రాంతమంతా వర్షాలు కురుస్తాయి. కొంకన్, మరాట్‌వాడ, సెంట్రల్ మహారాష్ట్ర, విదర్భా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

09/22/2016 - 12:10

రాయ్‌పూర్‌: ఆరోగ్యం విషమించడంతో పసికందు ప్రాణాలు కోల్పోయిన ఘటన కోల్‌కతా నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానంలో గురువారం చోటుచేసుకుంది. కోల్‌కతాకి చెందిన దంపతులు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని వైద్యం కోసం బెంగళూరు తీసుకెళ్లాల్సి ఉంది. విమానం బయలుదేరిన కొద్ది సేపటికే పసికందు ఆరోగ్యం విషమించడంతో అత్యవసరంగా రాయ్‌పూర్‌లో విమానం ల్యాండ్‌ అయింది. అప్పటికే పసికందు చనిపోయింది.

09/22/2016 - 11:37

శ్రీనగర్‌: జమ్మూ కాశ్మీర్‌లోని బందిపోరా జిల్లా అర్గమ్‌ గ్రామంలో ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టిన భద్రతా దళాలపై గురువారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. భద్రతా సిబ్బంది కూడా ఎదురుకాల్పులకు దిగారు. ఓ ఉగ్రవాదిని హతమార్చినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.

09/22/2016 - 08:30

పట్టిసీమ, పోలవరంలో మాకూ వాటా వెనక్కి తగ్గేది లేదన్న తెలంగాణ డిండి, పాలమూరుతో మాకు నష్టం
ప్రాజెక్టుల నిర్మాణం కూడదన్న ఆంధ్ర ఏకాభిప్రాయానికి తావులేని వాదనలు మూడు అంశాలపై ఇరుపక్షాలు ఓకే
ఇక అపెక్స్ కౌన్సిల్ భేటీలు ఉండవు జల సమస్యలపై వాళ్లే తేల్చుకోవాలి కేంద్ర జలవనరుల మంత్రి ప్రకటన

09/22/2016 - 08:26

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా మూలంగా పదేళ్లలో కలిగే ప్రయోజనాలను కేవలం రెండేళ్లలో కల్పించేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఇటీవల ప్రకటించిన ప్యాకేజీకి వచ్చే కేంద్ర మంత్రివర్గం సమావేశంలో చట్ట భద్రత కల్పిస్తామని సిఎం చంద్రబాబుకు జైట్లీ హామీ ఇచ్చినట్లు తెలిసింది.

09/22/2016 - 08:17

న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో దేశంలోనే కీలకపాత్ర పోషిస్తోందని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. బుధవారం నాడు ఢిల్లీ పర్యాటనలో టూరిజం ఇనె్వస్టర్స్ సమ్మిట్-2016లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఏపీ పర్యాటకపరంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సదుపాయాలను ఏర్పాటు చేసిందని వివరించారు.

Pages