జాతీయ వార్తలు
ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి అరెస్ట్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 22 September 2016
దిల్లీ: ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిని దిల్లీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. దిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రి ఆవరణలో భద్రతా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంతో పాటు వారిపై దాడికి దిగినందుకు ఆయనపై కేసు నమోదైంది. ఈ నెల 6వ తేదీన ఎయిమ్స్ ప్రాంగణంలోని వస్తువులను సోమనాథ్, ఆయన కార్యకర్తలు ధ్వంసం చేయడంతో పాటు వారిపై దాడికి దిగారు. దీంతో ఎయిమ్స్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రావత్ సోమనాథ్, ఆయన కార్యకర్తలపై పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.