S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/21/2016 - 13:56

దిల్లీ : కేంద్రఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం భేటీ అయ్యారు. విభజన అంశాలు, ఇటీవల ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్ధత అంశంపై చర్చించినట్లు సమాచారం. భేటీలో సీఎంతో పాటు కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు, ఎంపీలు తోట నరసింహం, సీఎం రమేష్‌ పాల్గొన్నారు.

09/21/2016 - 04:08

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: భూకంప ప్రభావిత ప్రాంతాల మోడరెట్ డ్యామేజ్ రిస్క్‌జోన్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయి. దేశంలో ఎక్కడ భూకంపాలు వస్తాయో రాష్ట్రాల వారీగా గుర్తించి రూపొందించిన పటాలను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం విడుదల చేశారు. దేశంలో భూకంప ప్రభావిత ప్రాంతాలను 4 జోన్‌లుగా విభజించారు.

09/21/2016 - 04:07

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: తెలంగాణ రాష్ట్రంలో ఏకీకృత సర్వీసు రూల్స్‌ను అమలు చేసి విద్యావ్యవస్థను గాడిలో పెట్టాలని కేంద్రహోశాఖ సంయుక్త కార్యదర్శి దిలీప్ కుమార్‌కు తెలంగాణ రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌టియు) నేతలు విజ్ఞప్తి చేశారు. ఎస్‌టియు అధ్యక్షుడు భుజంగరావు, ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటన చేశారు. దశాబ్దాలుగా ఈ ఏకీకృత సర్వీసు రూల్స్ అమలుకావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

09/21/2016 - 04:06

భువనేశ్వర్, సెప్టెంబర్ 20: అగ్రకులాల్లోని పేదలకు 25 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని దళిత నాయకుడు, కేంద్ర మంత్రి రాందాస్ అథావలే డిమాండ్ చేశారు. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం సీలింగ్‌ను ఎత్తివేసి, అదనంగా రిజర్వేషన్లు కల్పించాలని మంగళవారం ఇక్కడ సూచించారు. ‘అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలన్నదానికి నేను మద్దతు ఇస్తాను.

09/21/2016 - 04:06

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: జమ్మూ, కాశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో భారత సైనిక స్థావరంపై ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ప్రపంచ దేశాలు భారత్‌కు మద్దతు ప్రకటిస్తూనే ఉన్నాయి. తాజాగా జపాన్, జర్మనీ దేశాలు ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు.

09/21/2016 - 03:12

ఉరీ/ నౌగామ్, సెప్టెంబర్ 20: కాశ్మీర్‌లోని ఉరీ సైనిక శిబిరంపై ఉగ్రవాద దాడి జరిగి రెండు రోజులు తిరక్కుండానే పాక్ మిలిటెంట్లు మంగళవారం రెండుచోట్ల చొరబాట్లకు యత్నించారు. మొత్తం 15మంది ఉగ్రవాదులు ఆధీన రేఖ ప్రాంతం నుంచి కాశ్మీర్‌లోకి వచ్చేందుకు చేసిన ప్రయత్నాన్ని సైనిక దళాలు తిప్పికొట్టాయి. హోరాహోరీ కాల్పుల్లో పది మంది ఉగ్రవాదులు హతులయ్యారు. భారత జవాన్ ఒకరు మరణించారు.

09/21/2016 - 02:51

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: దేశరాజధాని ఢిల్లీలో పట్టపగలే దారుణం జరిగింది. 21 ఏళ్ల ఓ అమ్మాయిని 34 ఏళ్ల ఉన్మాది ఒకడు అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హతమార్చాడు. ఉత్తర ఢిల్లీలోని బురారీలో మంగళవారం ఉదయం 9గంటల ప్రాంతంలో కరుణ అనే అమ్మాయి నడిచి వెళ్తుండగా సురేందర్ సింగ్ అనే వ్యక్తి వెంబడించి కత్తితో దాడి చేశాడు. విచక్షణారహితంగా 22సార్లు ఆమెను కత్తితో పొడిచాడు.

09/21/2016 - 02:47

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, ప్రధా ని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి సహా మొత్తం 27 స్మార్ట్ సిటీలను కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించింది. వీటిలో వడోదర, ఆగ్రా, అజ్మీర్, నాగపూర్, గ్వాలియర్, థానె తదితర పట్టణాలున్నాయి. 27 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడానికి 66,883 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది.

09/21/2016 - 02:27

హైదరాబాద్, సెప్టెంబర్ 20: కేంద్రంలో కొనసాగుతున్న రావణుడి పాలన అంతమొందించేందుకు శ్రీరాముడి వానరసైన్యం సిద్ధం కావాలని ఎఐసిసి నాయకుడు, కేంద్ర మాజీమంత్రి మణిశంకర్ అయ్యర్ తమ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ తరపున ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం శిక్షణా తరగతులు ఏర్పాటు చేసింది.

,
09/21/2016 - 01:29

ఉరీలో జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన సైనికుల మృతదేహాలు వారి స్వస్థలాలకు చేరుకున్నాయ. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా మృతులకు ఘననివాళులు అర్పించారు.

చిత్రాలు..వీర మరణం చెందిన సైనికులకు మంగళవారంనాడు శ్రద్ధాంజలి ఘటిస్తున్న సూరత్‌లోని
స్వామి నారాయణ్ గురుకుల్ స్కూలు విద్యార్థులు. వారణాసిలోని గంగా ఘాట్ వద్ద మహిళల వౌనదీక్ష.

Pages