S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/24/2016 - 12:01

నెల్లూరు : శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి సోమవారం ఉదయం 9:12గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి35 నింగిలోకి దూసుకెళ్లనుంది. కౌంట్‌డౌన్‌ ప్రక్రియ శనివారం ఉదయం 9:12గంటలకు ప్రారంభమైంది. పీఎస్‌ఎల్‌వీ-సి35 రాకెట్‌ 8 ఉప గ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది.

09/24/2016 - 11:17

ముజఫరాబాద్‌: పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో ముజఫరాబాద్‌కు సమీపంలోని నౌసెహ్రీ ప్రాంతంలో శనివారం ఉదయం ప్రయాణికులతో వెళ్తున్న ఓ మినీ బస్సు నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 23 మంది మృతిచెందారు. ముగ్గురు ప్రయాణికులను రక్షించి ఆసుపత్రికి తరలించారు. మూడు మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.

09/24/2016 - 11:12

దంతెవాడ: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో శనివారం ఉదయం మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.

09/24/2016 - 04:02

న్యూఢిల్లీ, సెప్టెంబరు 23: తెలంగాణ ప్రభుత్వం తన భూమిని ఆక్రమించుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కి అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఫిర్యాదు చేశారు. శుక్రవారం అమె హోంశాఖ మంత్రిని కలిసి, ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ తాను ఎలాంటి భూకబ్జాలకు పాల్పడలేదన్నారు.

09/24/2016 - 04:11

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న పదో షెడ్యూల్‌లోని సంస్థల విభజనపై ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు. ఏపీ, తెలంగాణ అధికారులతో కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి జైదీప్ గోవింద్ ఆధ్వర్యంలో శుక్రవారం 10వ షెడ్యూల్‌లోని ఉమ్మడి సంస్థల విభజనపై ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు.

09/24/2016 - 03:58

న్యూఢిల్లీ, సెప్టెంబరు 23: ఏడాదికి కోటిన్నరకు పైగా టర్నోవర్ ఉండే వ్యాపారాలు, పరిశ్రమలు, సంస్థలు అన్నింటిపై కేంద్ర, రాష్ట్రాలకు నియంత్రణ ఉంటుందని ఎపి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన ఢిల్లీలో శుక్రవారం కూడా జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం రెండోరోజు జరిగింది. ఈ సమావేశానికి ఏపి తరఫున ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు హాజరయ్యారు.

09/24/2016 - 04:14

బెంగళూరు, సెప్టెంబర్ 23: కావేరీ జలాల వివాదం అనూహ్య మలుపు తిరిగింది. ఈ నదీ జలాలను కేవలం తాగునీటికి మాత్రమే వినియోగించాలంటూ కర్నాటక అసెంబ్లీ ప్రత్యేక సమావేశం శుక్రవారం ఏకగ్రీవంగా తీర్మానించింది. తమిళనాడుకు రోజుకు ఆరు వేల క్యూసెక్కుల నీటిని వ్యవసాయ అవసరాల నిమిత్తం అందించాలంటూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాన్ని అమలు చేయలేమని స్పష్టం చేసింది.

09/24/2016 - 03:42

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: భారత్ ఫ్రాన్స్‌నుంచి 7.87 బిలియన్ల యూరోలు (సుమారు 59వేల కోట్లు) వెచ్చించి 36 రఫాలే యుద్ధ విమానాలు కొనుగోలు చేయడానికి సంబంధించిన ఒప్పందంపై ఇరు దేశాలు శుక్రవారం ఇక్కడ సంతకాలు చేశాయి. ఈ యుద్ధ విమానాలకు ఆధునిక క్షిపణులు, ఆయుధ వ్యవస్థ బిగించి ఉంటుంది. దీంతో పాటు భారత్ అవసరాలకు అనుగుణంగా నిర్దిష్టమైన మార్పులు కూడా ఈ విమానాలకు చేసి ఇస్తారు.

09/24/2016 - 03:37

న్యూఢిల్లీ, సెప్టెంబరు 23:ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్ మీద నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది. ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రపై దర్యాప్తు నిలిపివేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది.

09/24/2016 - 03:37

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: కాశ్మీర్‌లో తాజా పరిస్థితులపైనా, వచ్చే నెలలో జరగబోయే బ్రిక్స్ సమావేశాల భద్రతా ఏర్పాట్లపై చర్చించేందుకు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ శుక్రవారం హోంమంత్రి రాజ్‌నాథ్‌తో భేటీ అయ్యారు. అరగంటపాటు జరిగిన ఈ ఇద్దరు సీనియర్ మంత్రుల సమావేశంలో పలు కీలక విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

Pages