S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/27/2016 - 02:02

కోల్‌కతా, సెప్టెంబర్ 26: మన దేశంలో పశ్చిమ కనుమలు అరుదైన పక్షులకు సురక్షిత ఆవాసంగా మారాయి. పశ్చిమ కనుమల్లోని కాఫీ, రబ్బరు, పోక తోటల్లో పదమూడు అత్యంత అరుదైన రకాలతోపాటు రెండు వందల రకాల పక్షులు ఈ తోటల్లో విహరిస్తున్నాయని జంతు శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. 30వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన 187 తోటల మధ్య రెండేళ్లపాటు తీవ్ర పరిశోధన చేసిన అనంతరం ఆ ఫలితాలను ప్రకటించారు.

09/27/2016 - 02:00

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: భారత్‌తో ఎప్పుడు పోరు జరిగినా తన చిరకాల మిత్రదేశం చైనా తనకు బాసటగా నిలుస్తుందన్న పాకిస్తాన్ విశ్వాసానికి ఇదో పెద్దదెబ్బ. ఇది పాకిస్తాన్ విశ్వాసమే కాదు.. ఆ దేశ నేతలు బహిరంగంగా చెప్పారు కూడా. అయితే పాకిస్తాన్‌కు తాను పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నట్టు మీడియాలో వచ్చిన వార్తలను చైనా ఖండించింది.

09/27/2016 - 01:59

విజయవాడ, సెప్టెంబర్ 26: భారీ వర్షాలు కురిసినప్పటికీ ఇంకా రాష్ట్రంలో 2.4 శాతం వర్షపాతం లోటు ఉందని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. జలవరులన్నింటినీ కాపాడుకోవాలని, చెరువులు, కుంటలకు సకాలంలో మరమ్మతులు చేయాలని సూచించారు. నీరు-ప్రగతిపై సర్పంచ్‌లు, సాగునీటి సంఘాల అధ్యక్షులు, అధికారులతో సోమవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

09/27/2016 - 00:35

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: ‘నీళ్లూ నెత్తురూ ఎన్నటికీ కలవవు. కలిసి ప్రవహించవు.’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో స్పందించారు. ఇస్లామిక్ ఉగ్రవాదంతో భారత్‌పై రక్తపాతానికి ఒడిగడుతున్న పాకిస్తాన్‌పై జలాయుధాన్ని ప్రయోగించేందుకు మోదీ యోచిస్తున్నారు. పాకిస్తాన్‌కు అత్యంత కీలకమైన సింధూ నదీ జలాల ఒప్పందంపై సోమవారం మోదీ నేతృత్వంలో అత్యున్నత స్థాయిలో సమీక్షా సమావేశం జరిగింది.

09/27/2016 - 01:54

నెల్లూరు/ సూళ్లూరుపేట, సెప్టెంబర్ 26: వరుస అంతరిక్ష ప్రయోగాలతో విజయపథంలో దూసుకెళుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో విజయాన్ని సాధించి వినూత్న రికార్డు సృష్టించింది. ఒక రాకెట్ ద్వారా బహుళ కక్ష్యల్లోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టే ప్రయోగాత్మక ప్రయోగంలో విజయం సాధించి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఒకే రాకెట్ ద్వారా 8 ఉపగ్రహాలను రెండు కక్ష్యల్లోకి పంపి శాస్తవ్రేత్తలు తమ సత్తాచాటారు.

09/27/2016 - 00:28

న్యూఢిల్లీ, సెప్టెంబరు 26: ఆంధ్రప్రదేశ్‌లో 3 విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్ర పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలోని గ్రీన్‌ఫీల్డ్ కమిటీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిం ది. తెలంగాణలోని కొత్తగూడెంలో విమానాశ్ర యం ఏర్పాటుకు ఏంపిక చేసిన స్థలానికి ఆమోద ముద్ర వేసింది. ఢిల్లీలో సోమవారం కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ నయన్ చౌబే నేతృత్వంలో గ్రీన్‌ఫీల్డ్ కమిటీ సమావేశం జరిగింది.

09/26/2016 - 05:33

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: పండుగ సీజన్ రానుండటంతో రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదకతతో కూడిన వేతనాలను బోనస్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్నట్లు సమాచారం. ‘మేం ఉత్పాదకతతో కూడిన 78రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాం. త్వరలోనే ఈ మేరకు ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించవచ్చు.

09/26/2016 - 05:16

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 25: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో వినూత్న ప్రయోగానికి సమయం ఆసన్నమైంది. నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి సోమవారం ఉదయం 9:12 గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి 35 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ రాకెట్ ద్వారా ఒకేసారి 8 ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు. ఇందులో భాగంగా శనివారం ప్రారంభమైన కౌంట్‌డౌన్ సజావుగా సాగుతోంది.

09/26/2016 - 05:05

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: దేశవ్యాప్తంగా ఐఐటి, ఐఎస్‌ఎం, ఎన్‌ఐటి, ట్రిపుల్‌ఐటిలలో ఖాళీగా ఉన్న వేలాది సీట్లను భర్తీ చేయాలని ప్రధాని నరేంద్రమోదీకి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి ఒక లేఖను ఆయన ప్రధానికి రాశారు.

09/26/2016 - 04:14

కోజికోడ్, సెప్టెంబర్ 25: ‘ముస్లింలు మనవాళ్లే, వాళ్లను ఓటుబ్యాంకుగానో, నిత్యావసర సరుకుల్లాగానో చూడవద్దు పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఇచ్చిన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ముస్లింల ఎదుగుదలకు అంతా తోడ్పడాలి’ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. రెండు రోజులుగా కేరళ లోని కోజికోడ్‌లో జరుగుతున్న భారతీయ జనతాపార్టీ జాతీయ మండలి సమావేశంలో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శతజయంతి వేడుకలు నిర్వహించారు.

Pages