S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/28/2016 - 08:15

ఖేరీ(యూపీ), సెప్టెంబర్ 27: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్‌పై సోమవారం షూ దాడి జరగడంతో విస్తృత భద్రత కల్పించారు. మంగళవారం ఖేరీ రోడ్‌షోలో పాల్గొన్న రాహుల్ ప్రధాని మోదీ ప్రభుత్వం పది, పదిహేను మందికి లబ్ధి చేకూర్చేందుకే పనిచేస్తోందని దుయ్యబట్టారు. మిగతా ప్రజానికాన్ని ఎన్‌డిఏ ప్రభుత్వం పట్టించుకోవడమే లేదని ఆరోపించారు.

09/28/2016 - 08:11

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: కావేరీ జల వివాదానికి సంబంధించి కర్నాటకకు మంగళవారం సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. బుధవారం నుంచి శుక్రవారం వరకూ అంటే ఈ నెల 30 వరకూ మూడు రోజులపాటు తమిళనాడుకు రోజుకు 6వేల క్యూసెక్కుల చొప్పున కావేరీ జలాలు అందించాల్సిందేనని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.

09/28/2016 - 08:09

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: అవినీతి ఆరోపణల కేసులో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న కార్పొరేట్ వ్యవహారాల శాఖ మాజీ డైరెక్టర్ బికె బన్సల్ తన కుమారుడితో కలిసి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. తూర్పు ఢిల్లీలోని నీలకంఠ్ అపార్ట్‌మెంట్‌లోని నివాసంలో వారు ఈ దారుణానికి ఒడిగట్డారు. బన్సల్, ఆయన కుమారుడు సొంత ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. కాగా బన్సల్ అవినీతి మొత్తం కుటుంబానే్న బలితీసుకుంది.

09/28/2016 - 08:09

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: భవిష్యత్ నిధికి సంబంధించిన చందాదారులు లేవనెత్తే అనుమానాలను, సమస్యలను నివృత్తి చేసేందుకు ఉద్యోగుల భవిష్య నిధిసంస్థ (ఇపిఎఫ్‌ఓ) త్వరలోనే ఒక ప్రత్యేక ఆన్‌లైన్ వ్యవస్థను ప్రారంభించనుంది. దీంతో ఇకపై ఉద్యోగుల అనుమానాలను నివృత్తి చేయడానికి కంపెనీ లేదా ఇపిఎఫ్‌ఓ ప్రమేయం అవసరం ఉండదు.

09/28/2016 - 08:07

మొరాదాబాద్, సెప్టెంబర్ 27: ఓ పక్క కాశ్మీర్‌లోని ఉరీ సైనిక శిబిరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిని యావద్భారతం ముక్తకంఠంతో ఖండిస్తున్న నేపథ్యంలో మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ ర్యాలీలో పాక్ అనుకూల నినాదాలు జరిగినట్టుగా కథనాలు వెలువడ్డాయి. ఈ ర్యాలీలో పాల్గొన్న కొందరు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసినట్టుగా సమాచార్ ప్లస్ అనే వార్తా చానల్ ప్రసారం చేసింది.

09/28/2016 - 08:07

డెహ్రాడూన్, సెప్టెంబర్ 27: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించడంతోపాటు హరిద్వార్‌లో గంగా హారతిని తిలకిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. డెహ్రాడూన్ చేరుకున్న అనంతరం ప్రణబ్ ఆధునీకరించిన ‘రాష్టప్రతి ఆషియానా’ను ప్రారంభించారు.

09/28/2016 - 08:05

కొల్లాం, (కేరళ), సెప్టెంబర్ 27: మానవ జీవితాన్ని మెరుగుపరిచే వివిధ సమాజ సంక్షేమ అంశాల్లో ముఖ్యంగా పరిశుభత్ర మెరుగుపడేందుకు కేరళకు చెందిన మాతా అమృతానందమయి చేపట్టిన కార్యక్రమాలు ఎంతగానో తోడ్పడ్డాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు.

09/28/2016 - 06:40

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: ఉరీ ఉగ్రవాద దాడికి పాల్పడి 18మంది భారత సైనికుల్ని పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్‌పై అన్ని విధాలుగా ఒత్తిడి పెంచే చర్యలను భారత్ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారత్‌లోని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌ను పిలిపించుకుని ఉరీ దాడి ఆధారాలను సాక్ష్యాలతో సహా భారత్ అందించింది.

09/28/2016 - 06:33

న్యూఢిల్లీ, సెప్టెంబరు 27: తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయులకు సంబంధించిన ఏకీకృత సర్వీసు రూల్స్ అమలుకు మార్గం సుగమమైంది. సర్వీసు రూల్స్‌ను 1998 నుంచి అమలు చేయాలంటూ ఏపీ, తెలంగాణ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో 1975నాటి రాష్టప్రతి ఉత్తర్వుల సవరణకు అడుగు ముందుకు పడింది. మంగళవారంనాడు హోంశాఖ కార్యాలయంలో హోంశాఖ అదనపుకార్యదర్శి దిలీప్‌కుమార్ ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.

09/28/2016 - 02:38

భద్రాచలం, సెప్టెంబర్ 27: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మంగళవారం మరో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. బస్తర్ ఐజీ ఎస్‌ఆర్‌పి కల్లూరి, సుక్మా ఎస్పీ కల్యాణ్ ఎలిశెల కథనం ప్రకారం...

Pages