జాతీయ వార్తలు

ఉత్తరాఖండ్‌కు రాష్టప్రతి ప్రణబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్, సెప్టెంబర్ 27: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించడంతోపాటు హరిద్వార్‌లో గంగా హారతిని తిలకిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. డెహ్రాడూన్ చేరుకున్న అనంతరం ప్రణబ్ ఆధునీకరించిన ‘రాష్టప్రతి ఆషియానా’ను ప్రారంభించారు. అక్కడ పరిసరాల్లోని చెట్లను, మొక్కలను పరిశీలించిన అనంతరం రుద్రాక్ష మొక్కను నాటారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ కె.కె.పాల్‌తోపాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఇక్కడి రాష్టప్రతి భవన్‌ను గతంలో కమాండంట్ బంగ్లాగా పిలిచేవారు. దీనిని 1920లో నిర్మించగా, 1998 మార్చిలో అప్పటి రాష్టప్రతి కె.ఆర్.నారాయణన్ ఇక్కడ బస చేశారు. అనంతరం 1975-76లో దీనిని పూర్తిగా ఆధునీకరించారు. రాష్ట్ర పర్యటనలో ఉన్నన్ని రోజులూ రాష్టప్రతి ప్రణబ్ ఇక్కడే బస చేస్తారు.
ఇలావుండగా బుధవారం ఉదయం 8.25 గంటలకు రాష్టప్రతి కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శిస్తారు. గురువారం హరిద్వార్‌లో గంగా హారతి కార్యక్రమాన్ని తిలకిస్తారు. ఈ ఏడాది జూన్‌లో ప్రణబ్ ఇక్కడకు వచ్చినప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించలేకపోయారు.