జాతీయ వార్తలు

చత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, సెప్టెంబర్ 27: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మంగళవారం మరో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. బస్తర్ ఐజీ ఎస్‌ఆర్‌పి కల్లూరి, సుక్మా ఎస్పీ కల్యాణ్ ఎలిశెల కథనం ప్రకారం... సుక్మా జిల్లాలోని ఫుల్‌బాగాడి పోలీస్‌స్టేషన్ పరిధిలో మిసిపారా అటవీప్రాంతంలో సుక్మా డిఎస్పీ రాంగోపాల్ కరియార్ నేతృత్వంలో డిఆర్‌జి, సీఏఎఫ్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వీరి రాకను గమనించిన మావోయిస్టులు ముందుగా వీరిపై కాల్పులకు తెగబడ్డారు. తేరుకున్న పోలీసు బలగాలు ఎదురుకాల్పులకు దిగారు. సుమారు గంటన్నర సేపు ఎదురుకాల్పులు జరిపిన తర్వాత మావోయిస్టులు సమీప అడవుల్లోకి పారిపోయారు. పోలీసు బలగాలు సంఘటనా స్థలంలో గాలింపు చేపట్టగా ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు, ఒక బర్మార్ తుపాకీ, 315 బోర్ తుపాకీ ఒకటి, విప్లవసాహిత్యం, నిత్యావసర వస్తువులు, మందులు, పేలుడు పదార్ధాలు దొరికాయి. మృతులు దండకారణ్య కిసాన్ మోర్చా సంఘ్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు హిడ్మా, ఆనందలుగా గుర్తించారు. ఈ ఏడాది వరుసగా జరిగిన ఎన్‌కౌంటర్లో ఇప్పటి వరకు 99 మంది మావోయిస్టులను మట్టుబెట్టినట్లుగా బస్తర్ ఐజీ కల్లూరి వెల్లడించారు.