జాతీయ వార్తలు

ఏకీకృతానికి లైన్ క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 27: తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయులకు సంబంధించిన ఏకీకృత సర్వీసు రూల్స్ అమలుకు మార్గం సుగమమైంది. సర్వీసు రూల్స్‌ను 1998 నుంచి అమలు చేయాలంటూ ఏపీ, తెలంగాణ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో 1975నాటి రాష్టప్రతి ఉత్తర్వుల సవరణకు అడుగు ముందుకు పడింది. మంగళవారంనాడు హోంశాఖ కార్యాలయంలో హోంశాఖ అదనపుకార్యదర్శి దిలీప్‌కుమార్ ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఏపీ నుండి విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్‌దాస్, విద్యాశాఖ అధికారులు వీరభద్రరెడ్డి,మస్తాన్‌రావు పాల్గొనగా, తెలంగాణ నుండి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, పాఠశాల విద్యా డైరెక్టర్ కిషన్, శ్రీహరి హాజరయ్యారు. ఏకీకృత సర్వీసు రూల్స్‌ను 1998 నుంచి అమలు చేయాలంటూ తెలంగాణ అధికారులు చేసిన ప్రతిపాదనకు అంగీకరిస్తున్నట్టు ఏపీ అధికారులు చెప్పారు. ఈ మేరకు లేఖ పంపించాలని ఆంధ్రప్రదేశ్ అధికారులకు హోంశాఖ సూచించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంనుంచి లేఖ కేంద్రానికి అందిన వెంటనే సర్వీసు రూల్స్ అమలు ప్రక్రియ వేగవంతం కానుంది. ముందుగా న్యాయశాఖకు, తర్వాత రాష్టప్రతి ఆమోదానికి సవరణ ఫైల్ వెడుతుంది. మూడు నాలుగు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది. సర్వీసు రూల్స్‌కు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు కేంద్ర హోంశాఖ గతంలో ఒకసారి హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.