జాతీయ వార్తలు

30 వరకూ నీళ్లు ఇవ్వాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: కావేరీ జల వివాదానికి సంబంధించి కర్నాటకకు మంగళవారం సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. బుధవారం నుంచి శుక్రవారం వరకూ అంటే ఈ నెల 30 వరకూ మూడు రోజులపాటు తమిళనాడుకు రోజుకు 6వేల క్యూసెక్కుల చొప్పున కావేరీ జలాలు అందించాల్సిందేనని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. తమిళనాడుకు నీళ్లు ఇచ్చే స్థితిలోలేమని కర్నాటక అసెంబ్లీ తీర్మానించిన నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇరు రాష్ట్రాల సిఎంలతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ జల ప్రతిష్టంభనను తొలగించాలని కేంద్రాన్ని ఆదేశించింది. బుధవారం నుంచి మూడు రోజుల పాటు తమిళనాడుకు కావేరీ జలాలు విడుదల చేయాల్సిందేనని తమ తాజా ఆదేశంలో న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, యుయు లలిత్‌లు స్పష్టం చేశారు. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 30న చేపడతామని న్యాయమూర్తులు తెలిపారు. గతంలో తాము జారీ చేసిన ఉత్తర్వులు కర్నాటక అమలుచేయకపోవడాన్ని ప్రస్తావించకుండానే ఇప్పటివరకూ విడుదల చేసిన నీటిని తదుపరి విడుదల పరిమాణంలో సర్దుబాటు చేస్తామని తెలిపింది. కర్నాట అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని పక్కనబెట్టి మరీ తన తాజా తీర్పును అమలుచేయాల్సిందేనని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ రకమైన వైఖరి సమాఖ్య వ్యవస్థలో ఎంత మాత్రం సరైంది కాదని తెలిపింది. ఇరు రాష్ట్రాలు తమ వాదనలను వినిపిస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. అయితే సుప్రీం కోర్టు తాజా ఆదేశాన్ని కర్నాటక తరపు న్యాయవాది ఎఫ్‌ఎస్ నారిమన్ తీవ్రంగా వ్యతిరేకించారు. కర్నాటక మొండివైఖరి కారణంగానే కావేరీ జలాల్లో ప్రతిష్టంభన ఏర్పడిందని, చివరికి అత్యున్నత న్యాయస్థానం తీర్పునుకూడా ఆ రాష్ట్రం అమలుచేయడం లేదని తమిళనాడు తరపున్యాయవాది శేఖర్ నపాడే స్పష్టం చేశారు. సమాఖ్య వ్యవస్థలో ఏ రాష్ట్రం కూడా సుప్రీం కోర్టు ఆదేశాన్ని అమలుచేయలేమని చెప్పజాలవని, ప్రతి విషయంలోనూ సంఘర్షణ పనికిరాదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. వివాదం కర్నాటక లేదా తమిళనాడు లేదా ఏ రాష్ట్రం మధ్య ఉన్నా వాటి మధ్య సమాఖ్య స్ఫూర్తి పరిఢవిల్లాలని హితవు చెప్పారు. ఈ జల వివాదాన్ని పరిష్కరించేందుకు పరస్పర సహకారంతోనే ముందుకువెళ్లాలని ఇరురాష్ట్రాలకు సుప్రీం కోర్టు విజ్ఞప్తి చేసింది.
chitram...
సుప్రీం తాజా తీర్పు నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంగళవారంనాడు బెంగళూరులో మోహరించిన రాపిడ్ యాక్షన్ దళాలు