S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/29/2016 - 08:38

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: చరిత్రాత్మక పారిస్ వాతావరణ ఒప్పందం అమలులోకి రావడానికి మార్గం సుగమం అయింది. భారత ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని ఆమోదించాలని బుధవారం నిర్ణయించింది. అయితే మహాత్మా గాంధీ జన్మదినోత్సవమైన అక్టోబర్ రెండో తేదీన కేంద్ర మంత్రివర్గం దీన్ని లాంఛనంగా ఆమోదిస్తుంది.

09/29/2016 - 08:37

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: పండుగల సీజన్ ముందుండటంతో రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా చెల్లించాలన్న ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విధంగా 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా చెల్లించడం వరుసగా ఇది అయిదోసారి.

09/29/2016 - 08:36

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తన ఎడమ కాలికి 40 శాతం వైకల్యాన్ని పొంది బాధపడుతున్న ఒక రోగికి రూ.25 లక్షల పరిహారాన్ని చెల్లించాలని ఒక ప్రైవేటు ఆసుపత్రిని, అందులో పనిచేస్తున్న ఇద్దరు ఆర్థోపెడిక్ వైద్యులను ఢిల్లీ వినియోగదారుల కమిషన్ ఆదేశించింది.

09/29/2016 - 08:34

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: కొంతమంది సిబిఐ అధికారులు తనను, తన కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టారని కుమారుడితోసహా ఆత్మహత్య చేసుకున్న కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మాజీ డైరెక్టర్ జనరల్ బికె బన్సల్ తన సూసైడ్ నోట్‌లో ఆరోపించారు.

09/29/2016 - 07:32

న్యూఢిల్లీ/బెంగళూరు, సెప్టెంబర్ 28: తమిళనాడుకు బుధవారం నుంచి రోజుకు ఆరు వేల క్యూసెక్కుల చొప్పున శుక్రవారం వరకూ కావేరీ జలాలను అందించాలంటూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశం అమలును కర్నాటక గురువారం వరకూ వాయిదా వేసింది. రేపు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ముఖ్యమంత్రుల సమావేశం ఫలితాన్ని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు.

09/29/2016 - 06:04

న్యూఢిల్లీ, సెప్టెంబరు 28: వైద్య కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను అక్టోబరు 7నాటికి పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు బుధవారం ఆదేశించింది. అలాగే ఏపీలోని 15శాతం అన్ రిజర్వ్‌డ్ కోటాలో తెలంగాణ విద్యార్థులకూ ప్రవేశాలు కల్పించాలని సుప్రీంకోర్టు తెలిపింది. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయడానికి మరో పక్షంరోజులపాటు అవకాశం ఇవ్వాలన్న తెలంగాణ విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.

09/29/2016 - 05:53

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: ఉరీ సైనిక శిబిరంపై ఇస్లామిక్ ఉగ్రవాదులతో దాడి చేయించిన పాకిస్తాన్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇస్లామాబాద్‌లో నవంబర్‌లో జరుగవలసిన సార్క్ శిఖరాగ్ర సమావేశాన్ని రద్దు చేయించటం ద్వారా అంతర్జాతీయంగా పెద్ద షాక్ ఇచ్చింది.

09/29/2016 - 05:51

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కి బుధవారం సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. లోధా కమిటీ సిఫార్సుల అమలును వాయిదా వేసుకుంటూ వస్తున్న బోర్డు వైఖరిపై సుప్రీం కోర్టు తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసింది.

09/29/2016 - 05:50

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28:సరిహద్దు చొరబాట్లను పూర్తి శక్తితో తిప్పికొట్టాలని సైనిక దళాలను రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ ఆదేశించారు. ఉరీ సైనిక శిబిరంపై ఉగ్రవాద దాడి నేపథ్యంలో నెలకొన్న భద్రతా పరిస్థితిపై త్రివిధ దళాల అధిపతులతో బుధవారం ఆయన సమీక్ష జరిపారు.

09/29/2016 - 05:40

న్యూఢిల్లీ/బెంగళూరు, సెప్టెంబర్ 28: తమిళనాడుకు బుధవారం నుంచి రోజుకు ఆరు వేల క్యూసెక్కుల చొప్పున శుక్రవారం వరకూ కావేరీ జలాలను అందించాలంటూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశం అమలును కర్నాటక గురువారం వరకూ వాయిదా వేసింది. రేపు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ముఖ్యమంత్రుల సమావేశం ఫలితాన్ని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని కర్నాటక సిఎం సిద్ధరామయ్య వెల్లడించారు.

Pages