S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/30/2016 - 02:48

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: దెబ్బకు దెబ్బ తీశారు. మన వీర జవాన్లపై దొంగదెబ్బ తీసిన ఉగ్రవాదులను, వాళ్లను అన్నీ తానై నడిపిస్తున్న పాకిస్తాన్‌ను భారత సైన్యం అనూహ్యమైన దెబ్బ తీసింది. ఉరీ సైనిక శిబిరంపై దాడి చేసి 18మందిని పొట్టన పెట్టుకున్న ముష్కరులకు భారత సైన్యం తన సత్తా ఏమిటో చాటిచెప్పింది. కోజికోడ్‌లో గత వారం ప్రధాని మోదీ ఉరీ ఉగ్రదాడి నేపథ్యంలో చెప్పిన మాటలు చేతల్లో చేసి చూపించారు.

09/30/2016 - 02:52

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: పాకిస్తాన్ చేయబోయే ప్రతిదాడులను తిప్పి కొట్టేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివిధ దళాలను ఆదేశించారు.

09/30/2016 - 02:46

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: చంద్రుడు లేని అమావాస్య చీకట్లు కమ్ముకున్న వేళ.. ఆక్రమిత కాశ్మీర్ వద్ద వాస్తవాధీన రేఖ వద్ద.. భారత సైన్యంలోని పారా ట్రూపర్లతో ఎంపిక చేసిన నాలుగు ప్రత్యేక సైనిక బృందాలు శత్రువుపై అనూహ్యమైన దాడికి సిద్ధమయ్యాయి.
* నైట్ విజన్ కళ్లజోళ్లు ధరించాయి. థర్మల్ ఇమేజింగ్ పరికరాలను సిద్దం చేసుకున్నాయి. అత్యంత ఆధునిక ప్రత్యేక ఆయుధాలను చేతపట్టాయి.

09/30/2016 - 02:41

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: ఆక్రమిత కాశ్మీర్‌లోని నాలుగు చోట్ల దాడులు ముగిసిన వెంటనే ప్రధాని మోదీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్టప్రతి, రాజ్యసభ అధ్యక్షుడు హమీద్ అన్సారీ, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవేగౌడలకు టెలిఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసానికి వెళ్లి దాడుల గురించి వివరించి ఆమె మద్దతు తీసుకున్నారు.

09/30/2016 - 02:53

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: పాకిస్తాన్ ఇప్పటికయినా తన తప్పు తెలుసుకుని భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఎగదోయడాన్ని ఆపుతుందన్న ఆశాభావాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యక్తం చేవారు.

09/30/2016 - 04:21

న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: తెలంగాణలో హైదరాబాద్‌సహా అన్ని జిల్లాల్లో అకాల వర్షాలతో తీవ్ర నష్టం జరిగిందని, వౌలిక వసతులను మెరుగుపరచడానికి రూ. 1,129 కోట్లు సాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. గురువారం నాడు ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు కేంద్రమంత్రులు చౌదరీ బీరేంద్ర సింగ్, సురేష్ ప్రభు, వెంకయ్యనాయుడులతో భేటీ అయ్యారు.

09/30/2016 - 02:25

సీమాంతర ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితిలోనూ సహించేది లేదు. భారత్‌లోకి పెద్ద ఎత్తున చొరబడటానికి ఉగ్రవాదులు సిద్ధమయ్యారన్న పక్కా సమాచారంతోనే సర్జికల్ దాడులు చేశాం. ఈ విషయాన్ని పాక్ డిజీఎంఓకు స్పష్టంగా చెప్పాం. మరోసారి ఇలాంటి దాడులు జరిపే ఆలోచన లేదు.
-లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్,
భారత్ డిజిఎంఓ

09/30/2016 - 02:23

పాకిస్తాన్ ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకోవాలి. వాస్తవాలను గ్రహించాలి. ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించవద్దని భారత్ పదే పదే పాకిస్తాన్‌కు చెప్తూనే ఉంది. వాళ్లు హామీలపై ఎన్నడూ నిలబడలేదు. భారత భూభాగంలో ఎలాంటి చొరబాట్లను సహించేది లేదు.
- ఎం.వెంకయ్యనాయుడు,
కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి

09/30/2016 - 02:26

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: ఆధీన రేఖ పొడవునా ఉన్న పాక్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తూ భారత సైనికులు జరిపిన దాడిని యావద్భారతం ముక్తకంఠంతో సమర్థించింది. బుధవారం అర్థరాత్రి నుంచి నాలుగు గంటల పాటు జరిగిన ఈ దాడుల సమాచారాన్ని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో వెల్లడించారు.

09/30/2016 - 02:13

న్యూఢిల్లీ, సెప్టెంబరు 29:ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కౌనె్సలింగ్‌లో స్పోర్ట్స్ కోటాను కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్పోర్ట్స్ కోటాపై స్టే విధిస్తూ ఉమ్మడి హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఆదేశాలను సవాల్ చేస్తూ ముగ్గురు విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసుపై గురువారంనాడు న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ నాగప్పన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

Pages