S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/29/2016 - 17:17

శ్రీనగర్:సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మరోవైపు జమ్మూకాశ్మీర్‌లోని పూంఛ్ జిల్లా మధేర్ ప్రాంతంలో ఉగ్రవాదులు మాటు వేశారు. భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. రక్షణ బలగాలు రంగంలోకి దిగి ఉగ్రవాదుల ఏరివేతకు కాల్పులు ప్రారంభించాయి. ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

09/29/2016 - 17:16

న్యూఢిల్లి:పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు, అనంతర పరిణామాలపై గురువారం సాయంత్రం జరిగిన అఖిలపక్షం సైన్యం సాహసాన్ని అభినందించింది. సర్జికల్ దాడుల తీరుని సైన్యాధికారులు వివరించారు. ప్రభుత్వానికి అండగా ఉంటామని అఖిలపక్షం మాటిచ్చింది. పాకిస్తాన్ కుట్రలకు సమాధానం సర్జికల్ దాడులు నిర్వహించామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు.

09/29/2016 - 16:50

న్యూఢిల్లి:పాకిస్తాన్‌లో లక్షిత దాడుల అనంతరం ముందస్తు చర్యల్లో భాగంగా గుజరాత్ నుంచి కాశ్మీర్ వరకు సరిహద్దు గ్రామాల్లో పాఠశాలలకు సెలవుప్రకటించారు. పాకిస్తాన్ ప్రతీకార చర్యకు పాల్పడే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

09/29/2016 - 16:50

న్యూఢిల్లి:పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో సర్జికల్ దాడుల అనంతరం పరిస్థితులపై అఖిలపక్ష సమావేశాన్ని కేంద్రప్రభుత్వం నిర్వహిస్తోంది. బుధవారం రాత్రి జరిపిన దాడి, దరిమిలా ఏర్పడిన పరిస్థితులపై అన్ని పార్టీలకు ప్రభుత్వం వివరించనుంది. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం మరికొద్ది సేపటిలో ప్రారంభం కానుంది.

09/29/2016 - 16:48

న్యూఢిల్లి:పాకిస్తాన్‌లో భారత సైన్యం దాడులకు పాల్పడటంతో ముందస్తుగా కేంద్రం కొన్ని చర్యలు తీసుకుంటోంది. పాకిస్తాన్ సరిహద్దుల్లో నియంత్రణ రేఖకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలోని గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. పాకిస్తాన్ ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

09/29/2016 - 16:47

న్యూఢిల్లి:ఉరీ దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై సైన్యం అకస్మాత్తుగా జరిపిన దాడి ప్రజల్లో దేశభక్తిని పురిగొల్పింది. సైన్యం చర్యకు సంపూర్ణ మద్దతు లభించింది. కాంగ్రెస్, జెడియు, ఆప్ సహా అన్ని పార్టీలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. పాకిస్తాన్‌కు ఇది ఓ గుణపాఠమని పేర్కొన్నాయి. అటు ఉరీ అమరవీరుల కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశాయి. తమ సైనికుల ఆత్మశాంతిస్తుందని వారు అన్నారు.

09/29/2016 - 16:46

న్యూఢిల్లి:పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలపై సైన్యం దాడులు చేసిందని భారత సైన్యానికి చెందిన డిజిఎంఒ రణ్‌బీర్‌సింగ్ వెల్లడించారు. గురువారం తెల్లవారుజామున ఈ దాడులు నిర్వహించామని, దాడులు కొనసాగుతాయని ఆయన వివిరించారు. గురువారం ఉదయం న్యూఢిల్లీలో ప్రధానితో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

09/29/2016 - 16:46

న్యూఢిల్లి:ఉరీ సైనికశిబిరంపై పాకిస్తాన్ తీవ్రవాదులు జరిపిన దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం అర్థరాత్రి దాటాక జరిపిన సైనిక ఆపరేషన్ సంచలనం రేపింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రమూకలకు శిక్షణ ఇస్తున్న శిబిరాలపై భారత కమాండోలు దాడి చేశారు. నియంత్రణ రేఖను దాటి హెలికాప్టర్లలో వెళ్లిన సైనికులు ప్యారాచూట్ల సహాయంతో కిందకు దిగారు.

09/29/2016 - 08:40

మథుర, సెప్టెంబర్ 28: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ గూండా రాజ్యాన్ని ఏర్పాటు చేసిందని, అభివృద్ధిని వేగవంతం చేయడంలో చాచా-్భతీజా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బుధవారం దుయ్యబట్టారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ, బిఎస్పీలను పూర్తిగా తుడిచిపెట్టే విధంగా బిజెపిని గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

09/29/2016 - 08:38

చెన్నై, సెప్టెంబర్ 28: తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బుధవారం పండగ బోనస్ ప్రకటించారు. బోనస్‌వల్ల ప్రభుత్వంపై 476 కోట్ల రూపాయల భారం పడుతుంది. మొత్తం 3.67 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని సిఎం వెల్లడించారు.

Pages