S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/01/2016 - 03:29

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: ఉగ్రవాదుల్ని ఉపయోగించుకుని పాక్ ఏజెన్సీలు దేశంలో ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఏ క్షణంలోనైనా పాక్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించింది.

10/01/2016 - 03:25

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 30: ఆధీన రేఖ ప్రాంతాన్ని ఉల్లంఘించి భారత్ తమ భూభాగంలో ప్రవేశించడం దురాక్రమణేనని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ నిప్పులు చెరిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించుకుంటామని, అందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలు తమ సైనిక దళాలకు ఉన్నాయని చెప్పారు.

10/01/2016 - 03:23

న్యూఢిల్లీ, సెప్టెంబరు 30: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఒడిశా దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తులపై సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చత్తీస్‌గఢ్, కేంద్ర జలవనరుల శాఖలకు నోటీసులు జారీ చేసింది. నోటీసులకు నాలుగు వారాల్లో సమాధానమివ్వాలని ఆదేశించింది.

10/01/2016 - 03:21

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30:ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు జిల్లాలకు పన్ను రాయితీలు ప్రకటిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ప్రత్యక్ష పన్నుల బోర్డు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కర్నూ లు, సీమాంధ్రలోని శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో పరిశ్రమలు స్థాపించే వారికి పన్ను రాయితీలు వర్తిస్తాయని సిటిబిటి ఆదాయ పన్ను వ్యవహారాల శాఖ కమీషనర్ మీనాక్షి గోస్వామి తెలిపారు.

10/01/2016 - 03:05

న్యూఢిల్లీ, సెప్టెంబరు 30: దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, బతుకమ్మ ఆడి తెలంగాణ సంస్కృతిని ఢిల్లీలో ప్రతిబింబించారు.

10/01/2016 - 02:45

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30:దేశం 2019 నాటికి సంపూర్ణ పరిశుభ్రత సాధిస్తుందనే ఆశాభావాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి అధ్యక్షతన శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఇండోసాన్- 2016 స్వచ్చ భారత్ సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రధాని మోదీ స్వచ్ఛత దిశగా వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న చర్యలు ఎంతో బాగున్నాయని చంద్రబాబు తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు.

09/30/2016 - 04:47

ఉగ్రవాదంతో పేట్రేగుతున్న పాక్‌కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. తమవి మాటలు కాదు చేతలేనంటూ దెబ్బకుదెబ్బ తీసింది. ఉరీ దాడులకు ప్రతీకారంగా అధీన రేఖ పొడవునా ఉన్న పాక్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరపుదాడులు జరిపింది. నాలుగు గంటల పాటు జరిగిన ఈ లక్షిత దాడుల్లో 38మంది ఉగ్రవాదులు హతులయ్యారు. పాక్ సైనికులూ ఈ దాడుల్లో హతమయ్యారు. ఉరీపై దాడికి ఉపకరించిన ఏడు ఉగ్ర శిబిరాలూ ధ్వంసమయ్యాయి.

09/30/2016 - 04:13

భద్రాచలం, సెప్టెంబర్ 29: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో వరుసగా మూడో రోజు తుపాకీలు గర్జించాయి. ఈ జిల్లాలోని కుంట బ్లాక్‌లో నీలంగూడ గ్రామ సమీపంలోని అడవుల్లో మావోయిస్టులు సమావేశం అయ్యారన్న సమాచారంతో పోలీసు బలగాలను అప్రమత్తం చేసి కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించినట్లు సుక్మా ఎస్పీ కల్యాణ్ ఎలిశెల వెల్లడించారు.

09/30/2016 - 03:37

ముంబయి, సెప్టెంబర్ 29: ఉరీ ఉగ్రవాద దాడి దృష్ట్యా పాకిస్తానీ నటీనటులను పరిశ్రమనుంచి నిషేధిస్తూ భారత సినీ నిర్మాతల అసోసియేషన్ (ఐఎంపిపిఏ) గురువారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. తమ నిర్మాత సభ్యులెవరుకూడా పాకిస్తానీ నటులెవరినీ తీసుకూడదని ఐఎంపిపిఏ తన 87వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఒక తీర్మానం ఆమోదించిందని అసోసియేషన్ అధ్యక్షుడు, నిర్మాత టిపి అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు.

09/30/2016 - 03:28

గువహటి, సెప్టెంబర్ 29: దేశంలో చీలికలు తీసుకురావడానికి ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నిస్తోందని, వారి సిద్ధాంతాలే అలాంటివాటిని ప్రోత్సహిస్తాయని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక కోర్టులో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త పెట్టిన కేసు నిమిత్తం గురువారం ఇక్కడకు వచ్చిన ఆయన ఆ సంస్థపై విరుచుకుపడ్డారు.

Pages