S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/30/2016 - 03:25

రాంచి, సెప్టెంబర్ 29: పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ సైన్యం చేసిన దాడిలో ‘ఉరీ’ బాధిత కుటుంబాల్లో ఎనలేని ఆనందాన్ని నింపింది. ఇటీవల కాశ్మీర్‌లోని ఉరీ సైనిక శిబిరంపై పాకిస్తాన్ మిలిటెంట్లు జరిపిన దాడిలో 18 మంది భారత సైనికులు మరణించిన విషయం తెలిసిందే. ఆ దాడిలో మృతి చెందిన జావరాముండా అనే సైనికుడి కుటుంబం భారత సైనిక చర్య పట్ల హర్షాన్ని వ్యక్తం చేసింది.

09/30/2016 - 03:16

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: ప్రత్యేక దళాల దాడికి ప్రతిగా పాక్ సైన్యం తమ ఇష్టానుసారం తాము ఎంచుకునే ప్రాంతంలో దాడి చేయవచ్చునని రక్షణ శాఖ అంచనా వేస్తోంది. గుజరాత్ నుండి జమ్మూ కాశ్మీర్ వరకు ఉన్న సరిహద్దుల్లో ఎక్కడైనా పాక్ ప్రతిదాడికి దిగవచ్చునని భావిస్తున్నారు.

09/30/2016 - 03:15

* ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులు సామూహిక ఆత్మహత్య చేసుకోవాలి.
* మోదీ ఇప్పుడు వ్యవహరించినట్లే ఎప్పటికీ దృఢంగా వ్యవహరించాలి.
* సర్జికల్ దాడి పాకిస్తాన్‌కు అవుటాఫ్ సిలబస్ ప్రశ్నలా మారింది.
* నవాజ్ షరీఫ్ పదవి ఊడే సమయం ఆసన్నమైంది
* మన జవాన్ల సాహసానికి తిరుగులేదు. రాజకీయ సంకల్పమే మన దేశంలో కొరవడింది.

09/30/2016 - 03:13

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: పాకిస్తాన్‌తో పరిమిత యుద్ధం తప్పదా? భారత సైన్యానికి చెందిన ప్రత్యేక పారాట్రూపర్లు బుధవారం రాత్రి ఆక్రమిత పాకిస్తాన్‌లో దాదాపు మూడు కిలోమీటర్ల లోపలికి చొచ్చుకుపోయి ఏడు సైనిక శిబిరాలపై దాడులు జరిపిన నేపథ్యంలో నెలకొంటున్న పరిణామాలు చూస్తుంటే పరిమిత యుద్ధం తప్పదేమోననే అనుమానాలు కలుగుతున్నాయి.

09/30/2016 - 03:07

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల శిబిరాలపై సైన్యం జరిపిన దాడులను తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్న చర్యగా రక్షణ నిపుణులు అభివర్ణించారు. అంతేకాదు సహనం అన్ని స్థాయిలను దాటిపోయిన కారణంగానే ఈ దాడులు జరపాల్సి వచ్చిందని కూడా వారంటున్నారు.

09/30/2016 - 03:05

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో మన సైన్యం చేసిన సర్జికల్ దాడులకు యావత్ భారతం గర్విస్తోంది. సామాజిక మాధ్యమాల్లో మన వీరజవాన్ల సాహసాలను కీర్తిస్తూ దేశవిదేశాల్లోని భారతీయులు స్పందిస్తున్నారు. కోట్ల కొద్దీ భారతీయులు మన సైన్య సాహసాన్ని ప్రశంసిస్తూ దేశమంతా వారి వెంట నడుస్తుందని పేర్కొంటున్నారు. పాకిస్తాన్‌కు, ఉగ్రమూకలకు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు.

09/30/2016 - 03:02

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: భారత సైనిక దళాలు గత రాత్రి ఆక్రమిత పాకిస్తాన్‌లోకి చొచ్చుకుని వెళ్లి ఇస్లామిక్ ఉగ్రవాదుల క్యాంపులపై దాడులు జరపటంపై యావత్ దేశం ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రముఖులు పూర్తి స్థాయిలో సమర్థించారు.

09/30/2016 - 03:02

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత్ జరిపిన సర్జికల్ దాడులను సైన్యం వీడియో తీసిందని, వాటిలో కొన్ని దృశ్యాలను ద్రోన్‌ల ద్వారా సేకరించిందని, ఈ దృశ్యాలను విడుదల చేయాలా, వద్దా, విడుదల చేస్తే ఎప్పుడు విడుదల చేయాలనే విషయాన్ని ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఉన్నతస్థాయి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

09/30/2016 - 03:01

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: కావేరీ జలాలపై తమిళనాడు, కర్నాటకల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు గురువారం ఢిల్లీలో జరిగిన సమావేశం విఫలమైంది. కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య అసాధ్యంగా మారింది. కావేరీ పరివాహక ప్రాంతంలో ఉన్న నీటి లభ్యతను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని పంపాలన్న కర్నాటక ప్రతిపాదనను తమిళనాడు తిరస్కరించింది.

09/30/2016 - 02:52

న్యూఢిల్లీ: ఇది యుద్ధం కాదు. యుద్ధంగా పిలవటానికి వీల్లేదు. ప్రపంచమంతటా వివిధ దేశాల సైనిక బలగాలు నిర్దిష్ట లక్ష్యాల మేరకు శత్రు స్థావరాలను, వ్యవస్థలను సరిహద్దు దాటి ప్రవేశించి విధ్వంసం చేసి తిరిగి సరిహద్దుల్లో యథాస్థానానికి తిరిగి రావటం.

Pages