జాతీయ వార్తలు

ఆర్తుల పాలిట నిజమైన ‘అమ్మ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్లాం, (కేరళ), సెప్టెంబర్ 27: మానవ జీవితాన్ని మెరుగుపరిచే వివిధ సమాజ సంక్షేమ అంశాల్లో ముఖ్యంగా పరిశుభత్ర మెరుగుపడేందుకు కేరళకు చెందిన మాతా అమృతానందమయి చేపట్టిన కార్యక్రమాలు ఎంతగానో తోడ్పడ్డాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. మాతా అమృతానంద మయి 63వ జన్మదినోత్సవం సందర్భంగా మంగళవారం ఇక్కడికి సమీపంలోని ఆమె ఆశ్రమం వద్ద చేరిన వేలాదిమంది భక్తులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగించారు. శానిటేషన్ విషయంలో మాతాజీ చేపట్టిన కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఎంతగానో తోడ్పడ్డాయని ప్రధాని చెప్పారు. పారిశుద్ధ్యం, తాగు నీరు, గృహ నిర్మాణం, విద్య, ఆరోగ్య రంగాలకు అమృతానందమయి మఠం అందించిన సేవలు, ఇచ్చిన భూరి విరాళాలను ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘ప్రధానంగా మరుగుదొడ్ల నిర్మాణంలో అమ్మ తీసుకున్న చొరవ మా స్వచ్ఛ్భారత్ కార్యక్రమానికి ఎంతగానో తోడ్పడింది’ అని మోదీ అన్నారు. కేరళలో నిరుపేదలకోసం 16 వేల మరుగుదొడ్లను నిర్మించడానికి ఉద్దేశించిన పారిశుద్ధ్య కార్యక్రమానికి వందకోట్ల విరాళాన్ని మఠం ప్రకటించడాన్ని సైతం ఆయన ప్రస్తావించారు. అమ్మ ఆశ్రమం ఇప్పటికే 2వేల మరుగుదొడ్లను నిర్మించినట్లు తనకు చెప్పారని ఆయన తెలిపారు. కోట్లాది మంది భక్తులకు అమృతానందమయి కరదీపిక అని ఆయన అన్నారు. నిజమైన అమ్మలాగా ఆమె తన భక్తులను కనిపించని, కనిపించే చర్యలద్వారా, దృశ్యాదృశ్య హస్తాలతో స్వాంతన చేకూరుస్తారన్నారు. మూడేళ్ల క్రితం అమ్మ 60వ జన్మదినం సందర్భంగా తాను ఆమెకు వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలియజేశానని, అయితే ఇప్పుడు అలా చేయలేకపోయినప్పటికీ సాంకేతికత ద్వారా ఆ పని చేయగలుగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
ప్రపంచంలోని నిరుపేదలకు నిత్యావసరాలయిన కూడు, గుడ్డ, ఆరోగ్యం, విద్య, జీవనోపాధి అవసరాలను తీర్చడానికే అమ్మ ఎప్పుడూ ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యల పరిష్కారానికి అమృతా విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు కొత్త పరిష్కార మార్గాలను కనుగొంటూ ఉండడం సంతోషించదగ్గ విషయమని ప్రధాని అన్నారు. ‘నమామి గంగె’ కార్యక్రమానికి అమృతానందమయి ఆశ్రమం వంద కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చిన విషయాన్ని కూడా ప్రధాన మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.
chitram...
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాతా అమృతానందమయతో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ