జాతీయ వార్తలు

కొద్దిమందికే మేలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖేరీ(యూపీ), సెప్టెంబర్ 27: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్‌పై సోమవారం షూ దాడి జరగడంతో విస్తృత భద్రత కల్పించారు. మంగళవారం ఖేరీ రోడ్‌షోలో పాల్గొన్న రాహుల్ ప్రధాని మోదీ ప్రభుత్వం పది, పదిహేను మందికి లబ్ధి చేకూర్చేందుకే పనిచేస్తోందని దుయ్యబట్టారు. మిగతా ప్రజానికాన్ని ఎన్‌డిఏ ప్రభుత్వం పట్టించుకోవడమే లేదని ఆరోపించారు. ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన మోదీ రైతులు, దళితులు, నిరుద్యోగ యువతను పట్టించుకోవడమే లేదని రాహుల్ నిప్పులు చెరిగారు. ‘మోదీజీ మీకు ఆ 15 మంది మీద ప్రేమ ఉంటే వారికే లబ్ధి చేకూర్చుకోండి. అలాగని దేశంలోని మిగతా వారి ప్రయోజనాలు విస్మరించొద్దు’ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎద్దేవా చేశారు. త్వరలో ఎన్నికలు జరిగే యూపీలో రాహుల్ 2,500 కిలోమీటర్ల కిసాన్ యాత్రను ప్రారంభించారు. వివక్షపూరిత పాలనకు స్వస్తిచెప్పి ప్రతి భారతీయుడి బాగుకోసం పనిచేయాలని ఎన్‌డిఏ సర్కార్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. సీతాపూర్‌లో షూ దాడి నేపథ్యంలో రాహుల్ రోడ్‌షోకు భారీ భద్రత కల్పించారు. ప్రతి రైతుకూ రుణమాఫీ వర్తింపచేయాలని, పంటలకు సరసమైన ధరకే విద్యుత్ సరఫరా చేయాలని మోదీ ప్రభుత్వంపై వత్తిడి పెంచడానికే కిసాన్ యాత్ర చేస్తున్నట్టు వెల్లడించారు. కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద, ఖేరీ మాజీ ఎంపీ జాఫర్ అలీ నఖ్వీ రోడ్‌షోలో పాల్గొన్నారు. రాహుల్ తొలుత సంకట దేవీ ఆలయంలో పూజలు చేశారు. నజీరుద్దీన్ వౌజు భవన్ వద్ద బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రోడ్‌షో ప్రారంభించారు. మితౌలీ, మహ్మదీ సభల్లో మాట్లాడిన రాహుల్ ప్రజలకు శుష్కవాగ్దానాలు గుప్పించి మోదీ అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు. తన సభకు వచ్చి మంచాలు ఎత్తుకెళ్లిన జనంపై విమర్శలు చేస్తున్న బిజెపి నేతలు పదివేల కోట్లు ఎగ్టొటి దేశం విడిచిపోరిపోయిన విజయ్ మాల్యా సంగతి ఏం చెబుతారని ఎదురుప్రశ్న వేశారు. ప్రతి ఒక్కరి అకౌంట్‌లో 15 లక్షల రూపాయల వేస్తామన్న జనధన్ ఖాతాల విషయం ఏమైందని నిలదీశారు.
chitram...
లఖీంపూర్ జిల్లాలో మంగళవారం రాహుల్ గాంధీ నిర్వహించిన కిసాన్ యాత్ర